జాతరలో బోర్ కొడుతోందని తిరిగి ఇంటికొస్తుండగా ఊహించని దృశ్యం.. అదృష్టం అడ్డుతగిలి అంతకుమించి..
ఆ ప్రాంతం సామాన్యులను సైతం లక్షాధికారులను చేస్తుంది. మొన్నటికి మొన్న ఇద్దరు వ్యక్తుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోగా..
ఆ ప్రాంతం సామాన్యులను సైతం లక్షాధికారులను చేస్తుంది. మొన్నటికి మొన్న ఇద్దరు వ్యక్తుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోగా.. తాజాగా ఆ కోవలోనే మరో ఇద్దరు లక్షాధికారులు అయ్యారు. ఇంతకీ అందరినీ లక్షాధికారులను చేసే ఆ ప్రాంతం మరేదో కాదు.. మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లా. విలువైన వజ్రాల నిక్షేపాలు అక్కడ ఉండటమే ఇందుకు కారణం అని చాలామంది అంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ది చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. రైక్‌వార్ అనే వ్యక్తి ఇటీవల పన్నాలో జరిగిన శరద్ పూర్ణిమ మేళాకు వెళ్లాడు. మేళా ముగిసిన అనంతరం బోర్ కొట్టి అతడు చెరువు గట్టుపై నడుస్తుండగా.. మెరుస్తున్న వస్తువు ఒకటి కనిపించింది. ఏంటని చూడగా అదొక అరుదైన వజ్రం. సుమారు 4.86 క్యారెట్లు ఉన్న ఆ వజ్రం విలువ రూ. 12 లక్షలు ఉంటుందని అంచనా. దీంతో అతడు ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్‌లో డిపాజిట్ చేశాడు.
ఈ కోవలోనే మరో వ్యక్తి దస్సూకోందర్ గత కొంతకాలంగా గాడా ఛతర్‌పుర్ అనే ప్రాంతంలో వజ్రాల వేటలో నిమగ్నమై ఉన్నాడు. బుధవారం అతడి పంట పడింది. ఓ అరుదైన వజ్రం దొరికింది. 3.40 క్యారెట్ల ఆ వజ్రాన్ని అతడు పన్నాలోని డైమండ్ ఆఫీస్‌లో డిపాజిట్ చేశాడు. ఇక ఈ రెండు వజ్రాలను త్వరలోనే వేలం వేయనున్నట్లు డైమండ్ ఆఫీస్ అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..