వామ్మో.! కన్ను మండుతోందని నులుముకున్నాడు.. కట్ చేస్తే చేతిలోకి ఊడిపడింది.. చివరికి ఏం జరిగిందంటే..

ఆ వృద్దుడికి ఏడాది క్రితం కంటి ఆపరేషన్ అయింది. కొన్నేళ్లు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత కన్ను దురద పుట్టిడం ప్రారంభించింది.

వామ్మో.! కన్ను మండుతోందని నులుముకున్నాడు.. కట్ చేస్తే చేతిలోకి ఊడిపడింది.. చివరికి ఏం జరిగిందంటే..
Lost His Eye While Rubbing
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 13, 2022 | 7:53 PM

ఆ వృద్దుడికి ఏడాది క్రితం కంటి ఆపరేషన్ అయింది. కొన్నేళ్లు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత కన్ను దురద పుట్టిడం ప్రారంభించింది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలానే ఆసుపత్రులు తిరిగాడు. ఎందరో డాక్టర్లను కలిశాడు. కాని ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దురద ఎక్కువ కావడమే కాదు.. మండుతుండటంతో.. ఆ వృద్దుడు కన్ను గట్టిగా నులుముకున్నాడు. అంతే! అది కాస్తా ఊడి చేతిలో పడింది. ఇదేంటి అనుకుంటూ ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. అక్కడ వైద్యులు ఏం చెప్పారంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ శివారులో ఉన్న ఓ గిరిజన గ్రామంలో గంగాధర్ సింగ్ అనే వృద్దుడు నివాసముంటున్నాడు. అతడు గడిచిన ఏడాది కాలంగా కంటి సమస్యతో బాధపడుతున్నాడు. కంటి నుంచి నీళ్లు రావడం, సరిగ్గా కనిపించాకప్వడం లాంటి ఇబ్బందులు పడేవాడు. అయితే ఆ గ్రామానికి వచ్చిన ఓ మహిళకు గంగాధర్ సింగ్ తన సమస్యను చెప్పుకోగా.. ఆమె ఎన్‌జీవో సాయంతో సదరు వృద్దుడికి 2021 నవంబర్‌లో కంటి ఆపరేషన్ చేయించింది.

అయితే ఆపరేషన్ అయిన కొద్దిరోజులకే గంగాధర్ సింగ్‌కి మళ్లీ కంటి సమస్య తిరగబెట్టింది. కన్ను దురుద పెట్టడం, మంట లాంటి సమస్యలు మొదలయ్యాయి. వీటి నుంచి బయటపడేందుకు చాలా ఆసుపత్రులు తిరిగాడు.. ఎందరో డాక్టర్లకు చూపించాడు. ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే ఓ రోజు సదరు వృద్దుడికి కన్ను దురద పుట్టడంతో.. దాన్ని రుద్దుకున్నాడు.. అంతే! అది కాస్తా ఊడి చేతిలో పడింది. ఒక్కసారిగా షాకైన వృద్దుడు.. వెంటనే ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. అక్కడ వైద్యులు అతడ్ని పరీక్షించి.. అది గాజు కన్ను అని తేల్చారు. దీంతో సదరు వృద్దుడు, అతడి బంధువులు దెబ్బకు షాక్ అయ్యారు. ఇక విషయం ఉన్నతాధికారులు దాకా వెళ్లడంతో.. వాళ్లు ఈ అంశంపై లోతైన విచారణకు ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..