PM Modi: గత స్మృతులు కళ్లముందు మెదులుతున్నాయి.. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..

హిమగిరుల్లో బుల్లెట్ స్పీడ్‌తో వందేమాతరం ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వేస్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ.. జెండా ఊపి ప్రారంభించారు.

PM Modi: గత స్మృతులు కళ్లముందు మెదులుతున్నాయి.. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 13, 2022 | 8:25 PM

హిమగిరుల్లో బుల్లెట్ స్పీడ్‌తో వందేమాతరం ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వేస్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ.. జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఉనాలోని అంబ్ అందౌరా రైల్వే స్టేషన్ల మధ్య ఈ రైలు నడవనుంది. దేశంలో ఇది నాలుగో వందే భారత్ రైలు. హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం పర్యటించిన ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు.. శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని గత ప్రభుత్వాలు హిమాచల్ ప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రధాని మోదీ ఖండించారు. హిమాచల్‌లో అంతకుముందు ఉన్న ప్రభుత్వం ప్రజా అవసరాలను తీర్చడంలో ఉదాసీనంగా వ్యవహరించదని ప్రధాని అన్నారు. ప్రజల ఆశలుచ, ఆకాంక్షలను ఎప్పటికీ అర్థం చేసుకోలేదని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. హిమాచ‌ల్‌లో గ్రామీణ రహదారులను రెట్టింపు వేగంతో నిర్మిస్తున్నామని.. గ్రామ పంచాయతీలకు కూడా వేగంగా కనెక్టివిటీ కల్పిస్తున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఉనా నగరానికి సంబంధించిన పాత జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు. ఉనాకు వచ్చినప్పుడల్లా గత స్మృతులు కళ్లముందు మెదులుతున్నాయని, ఇక్కడ చాలా కాలం గడిపానని చెప్పారు.

వందే భారత్ రైలు బుధవారం మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్ సాహిబ్, ఉనా రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఉదయం 5.50 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది. వైఫై, 32 అంగుళాల ఎల్సీడీ టీవీలు, ఆల్ట్రావయోలెట్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్స్ వంటి సేవలు వందే భారత్ రైలు ప్రత్యేకం. ఈ రైలు ద్వారా హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు ప్రధాని మోదీ. త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది. అభిమానులు, బీజేపీ శ్రేణులు.. ప్రధానికి అపూర్వ స్వాగతం పలికారు. మోదీ.. మోదీ, జై శ్రీరాం’ లాంటి నినాదాలతో రైల్వే స్టేషన్‌ పరిసరాలు హోరెత్తాయి. రైల్వే ప్లాట్‌ఫాం నుంచి అలా నడుచుకొని వెళ్తూ జనానికి మోదీ అభివాదం చేస్తుండగా.. రెట్టింపు ఉత్సాహంతో ‘దేఖో దేఖో షేర్‌ ఆయా.. అంటూ నినదించారు.

ఇవి కూడా చదవండి

హిమాచల్‌ ప్రదేశ్ పర్యటనలో భాగంగా.. ఐఐఐటీ ఉనాను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఉనాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేసారు. ఆ తర్వాత చంబాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతేకాకుండా రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్రంలో దాదాపు 3125 కి.మీ రోడ్ల అప్‌గ్రేడేషన్ కోసం ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ప్రత్యేక పనులు చేపట్టింది కేంద్రం. రాష్ట్రంలోని 15 సరిహద్దులు, సుదూర బ్లాకుల్లో 440 కిలోమీటర్ల మేర రోడ్ల అప్‌గ్రేడేషన్ కోసం 420 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయగా.. ఈ పథకం పనులను కూడా మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..