Andhra Pradesh: ఓ ఎన్ఆర్ఐ బాగోతం.. నెల రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు.. ఇంతలో కథ అడ్డం తిరగడంతో..

యాభై లక్షల కట్నం తీసుకున్నాడు.. ఇరవై ఐదు సవర్ల బంగారు ఆభరణాలు పుచ్చుకున్నాడు.. అమెరికా వెళుతున్నాను..‌ ఆ తర్వాత తన భార్యను తీసుకెళ్తానన్నాడు.

Andhra Pradesh: ఓ ఎన్ఆర్ఐ బాగోతం.. నెల రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు.. ఇంతలో కథ అడ్డం తిరగడంతో..
NRI arrested
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 13, 2022 | 5:41 PM

యాభై లక్షల కట్నం తీసుకున్నాడు.. ఇరవై ఐదు సవర్ల బంగారు ఆభరణాలు పుచ్చుకున్నాడు.. అమెరికా వెళుతున్నాను..‌ ఆ తర్వాత తన భార్యను తీసుకెళ్తానన్నాడు. తీరా అమెరికాలో నెలకి కోటిన్నర సంపాదించే అమ్మాయి పరిచయం కాగానే ఇండియాలో పెళ్ళైన సంగతే మర్చిపోయాడు. నెల రోజుల్లోపే రెండోసారి పెళ్ళికొడుకై అమెరికాలో కోటిన్నర సంపాదించే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సోషల్ మీడియా యుగంలో ఎంత దాచుదామన్నా నిజం దాగటంలేదు. అమెరికాలో అమ్మాయికి మొదటి భార్య గురించి తెలిసి పోయింది. వెంటనే ఇన్‌స్టా గ్రామ్ ఖాతా ద్వారా మొదటి భార్యకు తమ పెళ్ళి ఫోటోలను పంపింది. ఇంకేముంది మనోడి భాగోతం బయటపడి పోలీసులు చిక్కాడు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడికి చెందిన బాజీ నారాయణ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది మేలో పెళ్లి చేసుకునేందుక సిద్దమయ్యాడు. చేబ్రోలకు చెందిన నాగతేజ కూడా ఇంజనీరింగ్ ఫూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఇరువురి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని సంబంధం కుదుర్చుకున్నారు. యాభై లక్షల నగదు, ఇరవై ఐదు సవర్ల బంగారు ఆభరణాలను పెళ్లి సయమంలో కట్నంగా ఇచ్చారు. మే నెల ఇరవైవ తేదిన పెళ్లి జరిగింది. నెల రోజుల పాటు బాజీ నారాయణ ఇండియాలోనే ఉన్నాడు. తర్వాత అమెరికా వెళ్లి పోయాడు.

ఆ తర్వాత సీన్ మారింది. ఈ సమయంలో నెలకి కోటిన్నర రూపాయల జీతం సంపాదించే మెహతా పరిచయం అంది. వెంటనే ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అయితే బాజీ నారాయణ ఇండియాలో నాగతేజను వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్న మెహతా.. నాగతేజ ఇన్‌స్టా గ్రాం ద్వారా ఆమె నంబర్ సాధించి వారిద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పింది. అంతేకాకుండా మెహతా, బాజీ నారాయణ కలిసి ఉన్న ఫోటోలను నాగతేజకు వాట్సఫ్ చేసింది. అయితే ఈ విషయాన్ని నాగతేజ బంధువులకు చెప్పింది. బాజీ నారాయణ తల్లిదండ్రులను, బంధువులను ప్రశ్నిస్తే ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే నంటూ ఎదురు దాడి చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా సెఫ్టెంబర్లో బాజీ నారాయణ ఇండియాకి వచ్చి నాగతేజ వాళ్ల ఇంటికి వచ్చాడు. దీంతో నాగతేజ బాజీ నారాయణను నిలదీసింది. అయితే తాను రెండో పెళ్లి చేసుకోలేదంటూ బాజీ నారాయణ బుకాయించాడు. అతని ల్యాప్ ట్యాప్ ను పరిశీలించగా తాను పని చేస్తున్న కంపెనీలో సెలవు కోసం తన భార్య చచ్చిపోయిందని మొయిల్ పెట్టినట్లు ఉంది. ఈ విషయాన్ని కూడా నాగతేజ.. బాజీ నారాయణకు చెప్పి నిలదీసింది. అప్పుడు బాజీ నారాయణలోని అసలు రూపం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని బయటకు చెబితే నాగతేజ న్యూడ్ ఫోటోలను బయట పెడతానని బెదిరించాడు.

దీంతో నాగ తేజ బంధువులు పోలీసులకు ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి బాజీ నారాయణను అరెస్టు చేశారు. ఎన్ఆర్ఐ సంబంధాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎఎస్పీ సుప్రజ తెలిపారు. గతంలోనూ నిత్య పెళ్లి కొడుకు విషయం చూశామని ఏకంగా ఎనిమిది పెళ్లిల్లు చేసుకున్నాడన్నారు. ఇప్ఫుడు బాజీ నారాయణ కూడా నెల రోజుల వ్యవధిలోనే రెండు పెళ్లిల్లు చేసుకున్నాడన్నారు. ఎన్ఆర్ఐ సంబంధం కుదర్చుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

-రిపోర్టర్ : టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..