Male Infertility: ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా..? తండ్రి అయ్యే అవకాశాన్ని కోల్పోతారు జాగ్రత్త.. ఇంకా..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Oct 11, 2022 | 6:40 PM

మారిన జీవనశైలి, తీసుకునే ఆహారం, అనవసర అలవాట్లు, అతిగా పలు పరికరాలను వినియోగించుకోవడం వల్ల వంధత్వం సమస్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Male Infertility: ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా..? తండ్రి అయ్యే అవకాశాన్ని కోల్పోతారు జాగ్రత్త.. ఇంకా..
Male Infertility

ప్రస్తుత కాలంలో మహిళలతో పాటు, పురుషులలో కూడా వంధ్యత్వం సమస్య నిరంతరం పెరుగుతూ వస్తోంది. ఈ సమస్యకు చాలానే కారణాలు ఉన్నాయి. మారిన జీవనశైలి, తీసుకునే ఆహారం, అనవసర అలవాట్లు, అతిగా పలు పరికరాలను వినియోగించుకోవడం వల్ల వంధత్వం సమస్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు, మహిళలు బిగుతుగా ఉండే జీన్స్, హై హీల్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారు అనారోగ్యానికి గురికాడం, సంతానోత్పత్తి సమస్యలు పెరగడం ప్రారంభమవుతుంది. చివరకు ఇది సంతానలేమికి కారణమవుతుంది. పురుషుల్లో.. ధూమపానం, మద్యపానం, లేట్ నైట్ పార్టీలు, డ్రగ్స్ మొదలైన వాటితో పాటు ఎక్కువ గంటలు ల్యాప్‌టాప్‌ ద్వారా పనిచేయడమని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం వంటి వాటి వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్య మరింత పెరుగుతుందని.. ఇది జీవితంపై పెను ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

ల్యాప్‌టాప్ వంధ్యత్వ సమస్యను ఎలా పెంచుతుంది?

  • ల్యాప్‌టాప్‌లు పురుషులలో వంధ్యత్వానికి లేదా నపుంసకత్వానికి కారణంగా మారుతుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే పురుషులు తమ ఒడిలో లేదా తొడలపై ల్యాప్‌టాప్‌ను ఉంచి పనిచేస్తారు. ల్యాప్‌టాప్ నుంచి వెలువడే వేడి కారణంగా వారి వృషణాల ఉష్ణోగ్రత 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరుగుతుంది.
  • దీంతో వృషణాలు ప్రమాదంలో పడతాయి. వృషణాలలో మాత్రమే స్పెర్మ్‌లు ఉత్పత్తి అవుతాయి. ల్యాప్‌టాప్ వేడి కారణంగా వృషణాల ఉష్ణోగ్రత ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగినప్పుడు, వీర్యకణాల కౌంట్ 40 శాతం తగ్గుతుంది. ఇది పురుషులలో సంతానలేమి సమస్యకు దారితీస్తుంది.
  • ఉష్ణోగ్రత కేవలం 1 నుంచి 2 డిగ్రీలు పెరిగినప్పుడు, వృషణాలలో స్పెర్మ్ కౌంట్ 40 శాతం పడిపోతుంది. అయితే ల్యాప్‌టాప్‌ను రోజంతా ఒడిలో పనిచేసినా లేదా గంటల తరబడి తొడలపై ఉంచినా, అప్పుడు వృషణాల ఉష్ణోగ్రత 5 డిగ్రీల వరకు పెరుగుతుంది.
  • ఇలాగే జరిగితే స్పెర్మ్‌ల కౌంట్ పడిపోతుందని.. చివరకు స్పెర్మ్‌లో నాణ్యత అనేది ఉండదని హెచ్చరిస్తున్నారు.
  • ఎందుకంటే ల్యాప్‌టాప్ వేడి కారణంగా స్పెర్మ్ కౌంట్ మాత్రమే ప్రభావితం కాదు. బదులుగా, స్పెర్మ్ నాణ్యతపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
  • స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉండటం వల్ల, పురుషులు తండ్రి అయ్యే ఆనందాన్ని కోల్పోతారు.

దీనిని ఎలా నివారించాలి?

ఇవి కూడా చదవండి

  • ప్రైవేట్ పార్ట్స్ పై చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే ముందుగా ల్యాప్ టాప్ ని ఒడిలో పెట్టుకుని పని చేసే అలవాటును మానుకోండి. అవసరమైతే, మీరు దీన్ని ఒక గంట లేదా రెండు గంటలు చేయవచ్చు. కానీ రోజువారీగా అలవాటు చేసుకోవడం మాత్రం మంచిది కాదు.
  • పని చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ నుంచి వేడి విడుదల అవ్వడమే కాకుండా విద్యుదయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది. అంటే, EMF దాని ప్రభావం ఇంకా పెరుగుతుంది. ఇలానే కొనసాగితే జీవితకాలం పాటు ఈ సమస్య కొనసాగుతుంది.
  • విద్యుదయస్కాంత క్షేత్రం పురుషులలో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను తగ్గించడమే కాకుండా లైంగిక సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కదలిక, తీవ్రతను కూడా తగ్గిస్తుంది. ఇది గర్భాశయాన్ని చేరుకోవడానికి, ఫలదీకరణం చేసే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu