AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో దారుణం.. అష్టైశ్వర్యాల కోసం ఇద్దరు మహిళల నరబలి.. ఆ వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే మంచిదంటూ తీసుకెళ్లి..

మూడు నెలల వ్యవధిగా కనిపించకుండా పోయిన ఇద్దరు మహిళలు ఎర్నాకులంలో జీవనోపాధి కోసం లాటరీ టిక్కెట్లు అమ్మేవారని పోలీసులు తెలిపారు.

కేరళలో దారుణం.. అష్టైశ్వర్యాల కోసం ఇద్దరు మహిళల నరబలి.. ఆ వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే మంచిదంటూ తీసుకెళ్లి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Oct 11, 2022 | 4:21 PM

Share

కేరళ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఎర్నాకులంలో మహిళల నరబలి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదృశ్యమైన ఇద్దరు మహిళలు మరణించారని.. వారిని నరికి నరబలి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కొచ్చి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన ఇద్దరు మహిళలు కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందినవారు. వీరిని తిరువల్లకు తీసుకువచ్చి బలి ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారని.. నిందితులు భగవాల్ సింగ్, లైలా, షఫీ అకా రషీద్ గా గుర్తించారు. మహిళలను అక్రమంగా తరలించిన ఏజెంట్‌, దంపతులను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తిరువళ్లకు చెందిన భగవత్, పెరుంబవూరుకు చెందిన అతని భార్య లీల, పెరుంబవూరుకు చెందిన షిహాబ్ ను కూడా నరబలి కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు మహిళలను బలి ఇస్తే ఎనలేని సంపద లభిస్తుందని భగవత్, లీల దంపతులను షఫీ అకా రషీద్‌ నమ్మించినట్టు తెలుస్తోంది. అప్పుల్లో ఉన్న దంపతులు అతడిని నమ్మి ఇద్దరు అమాయక మహిళలను బలి ఇచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.

మూడు నెలల వ్యవధిగా కనిపించకుండా పోయిన ఇద్దరు మహిళలు ఎర్నాకులంలో జీవనోపాధి కోసం లాటరీ టిక్కెట్లు అమ్మేవారని పోలీసులు తెలిపారు. కాలడిలో లాటరీ టిక్కెట్లు అమ్మిన నలభై తొమ్మిదేళ్ల రోసిలీ జూన్‌లో కనిపించకుండా పోగా.. ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న ఆమె కుమార్తె ఆగస్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా సెప్టెంబర్ 27న ఎర్నాకులంలోని సౌత్ రైల్వే స్టేషన్‌లో లాటరీలు అమ్మిన తమిళనాడు ధర్మపురికి చెందిన 52 ఏళ్ల పద్మం అనే మహిళ అదృశ్యం కాగా.. ఆమె బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించినట్లు కడవంతర పోలీసులు తెలిపారు.

పెరుంబవూరులోని ఒక ఏజెంట్ మహిళలను తిరువళ్లకు తీసుకురావడంలో సహాయం చేశాడని.. తిరువళ్లలో అష్టైశ్వర్యాలతో తులతూగాలన్న కోరికతో దంపతులు నరబలి నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ముందుగా.. కడవంతరలో అదృశ్యమైన మహిళ కోసం తిరువళ్ల వరకు గాలించగా.. కలాడికి చెందిన మరో మహిళ కూడా హత్యకు గురైనట్లు గుర్తించి పలు కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నరబలి విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించి తిరువళ్లకు చెందిన భగవత్‌ను కలిసేలా చేశారు.

ఇవి కూడా చదవండి

పెరుంబవూరుకు చెందిన వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి లాభాలతో పాటు, ఆశించిన ఫలితాలు వస్తాయని నమ్మించి తీసుకెళ్లారని తెలిపారు. బలి ఇచ్చిన ఇద్దరి మృతదేహాలను ఖననం చేశారని.. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేరళలో ఇలాంటి ఘటన ఎప్పుడూ నివేదించలేదని తెలిపారు. అక్షరాస్యత అధికంగా ఉండే కేరళలో క్షుద్రపూజలు, నరబలి లాంటి మూఢనమ్మకాలు వెలుగు చూడడం కలకలం రేపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం..