Side Effects Of Green Tea Bag: మీరు టీ బ్యాగ్స్‌తో గ్రీన్‌ టీ తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

త్వరగా తయారయ్యే ఈ టీ బ్యాగ్ గ్రీన్‌టీ.. మన ఆరోగ్యానికి హాని కలగజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్‌లలో కెఫిన్ మోతాదుకు ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది.

Side Effects Of Green Tea Bag: మీరు టీ బ్యాగ్స్‌తో గ్రీన్‌ టీ తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Green Tea
Follow us
Basha Shek

|

Updated on: Oct 11, 2022 | 5:53 PM

మనలో చాలామంది పాలతో చేసిన టీలు, కాఫీలే తాగుతారు. అయితే కొంతమంది మాత్రం ఇన్‌స్టంట్‌ అంటూ టీ బ్యాగ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎక్కువగా ఆఫీసులు, ప్రయాణాల్లో టీబ్యాగులతో కూడిన టీలు, కాఫీలు అదే పనిగా తాగేస్తుంటారు. మార్కెట్లలో కూడా రకరకాల ఫ్లేవర్లలో టీ బ్యాగులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం కోసం గ్రీన్‌ టీ తాగేవారు ఎక్కువగా ఈ టీ బ్యాగ్‌లనే ఉపయోగిస్తారు. అయితే త్వరగా తయారయ్యే ఈ టీ బ్యాగ్ గ్రీన్‌టీ.. మన ఆరోగ్యానికి హాని కలగజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్‌లలో కెఫిన్ మోతాదుకు ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. దీంతో పాటు గ్రీన్‌ టీ బ్యాగుల వినియోగంపై తాజా అధ్యయనంలో పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..

మోతాదుకు మించి ప్లాస్టిక్‌..

సాధారణంగా గ్రీన్‌ టీ బ్యాగ్‌లు పాలీప్రొఫైలిన్, నైలాన్, రేయాన్‌లను పేపర్లతో తయారుచేస్తారు. మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, ఒక ప్లాస్టిక్ టీ బ్యాగ్ 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్, 3.1 బిలియన్ నానోప్లాస్టిక్ కణాలను నీటిలోకి విడుదల చేస్తాయి. గ్రీన్‌టీ తాగేటప్పుడు ఈ ప్లాస్టిక్‌ అంతా వేడి నీటిలోకి పారిపోతుంది. ఇది శరీరానికి తీవ్ర హానికరం కలిగిస్తుంది. ఇక గ్రీన్‌టీ బ్యాగుల్లో EGCG అనే యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయి. ప్రతి గ్రీన్ టీ బ్యాగ్‌లో1.09 నుంచి 2.29 mg ECGC ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఫలితంగా ఈ టీతో తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.

క్యాన్సర్‌ కారకాలు..

గ్రీన్ టీ బ్యాగ్‌లలో క్యాన్సర్ కారకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఎపిక్లోరోహైడ్రిన్ అని పురుగుల మందుల్లో ఉపయోగించే పదార్థాన్ని ఈ టీబ్యాగుల్లో ఎక్కువగా వాడతారు. కానీ ఈ పదార్ధం నీటితో కలిసినప్పుడు క్యాన్సర్ కారక రసాయనాలను ఉత్పత్తి అవుతాయి. ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలాగే వంధ్యత్వానికి దారితీస్తుంది. అందుకే సంతానోత్పత్తి సమస్యలు ఉన్న మహిళలు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తారు.

ఇవి కూడా చదవండి

క్లోరిన్‌ తో పాటు..

చాలా సందర్భాలలో శుభ్రంగా కనిపించే తెల్లటి టీ బ్యాగ్‌లు కాగితంపై క్లోరిన్ రసాయన చికిత్స ద్వారా బ్లీచ్ చేయబడి ఉంటాయి. కాబట్టి, మీరు మీ టీ బ్యాగ్‌ను వేడి నీటిలో ముంచినప్పుడు, మొత్తం క్లోరిన్ విడుదల అవుతుంది. ఇంకా, ఇది మీ శరీరాన్ని దెబ్బతీస్తుంది. జూలై 2017లో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) టీ బ్యాగ్‌లలో స్టెప్లర్ పిన్‌లను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఇది శరీరంలోకి వెళితే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారి తీస్తుంది. వదులుగా ఉండే ఆకులే కాకుండా, గ్రీన్ టీ బ్యాగ్‌లలో దుమ్ము రేణువులు ఉంటాయి. ఎందుకంటే టీ ఆకులను సన్నగా తరిగి ముక్కలుగా చేసి ఉంటాయి. అందువల్ల, టీ సమ్మేళనాలు తేమ, ఆక్సిజన్‌తో ప్రతిస్పందిస్తాయి, ఫలితంగా టీ నాణ్యత వేగంగా కోల్పోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..