Cheese Side Effects: ఇటువంటి లక్షణాలున్నవారు పొరపాటున కూడా పనీర్ ని ఎక్కువగా తీసుకోవద్దు .. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
పనీర్ వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనప్పటికీ.. ఎక్కువ పనీర్ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుందని మీకు తెలుసా.. ముఖ్యంగా ఈ పనీర్ ను కొంతమంది వ్యక్తులు ఎక్కువగా తీసుకోకూడాదు. ఎవరో ఈరోజు తెలుసుకుందాం..
దక్షిణ ఆసియా వంటకాలలో ఉపయోగించే అతి సహజమైన పదార్ధం పనీర్. పూర్వకాలం నుంచి మన దేశంలో సాంప్రదాయ వంటల్లో ఉపయోగించే అతి సాధారణ పాల విరుగుడు. పనీర్ ను భారత దేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని వేయించిన తరువాత పాలకూరతో పాలక్ పనీర్ లేదా బఠాణీలతో మట్టర్ పనీర్ వంటి అనేక వంటకాలను తయారు చేస్తారు. అసలు ఇంట్లో పార్టీ అయినా లేదా మీరు ఏదైనా మంచి రుచికరమైన ఆహారం తినాలనుకున్నా.. పనీర్‌తో చేసిన అనేక వంటకాలు మెనూలో ఉండాల్సిందే. ఈ పనీర్‌ను శాకాహారులు, మాంసాహారులు ఇద్దరూ ఇష్టంగా తింటారు. ఇందులో ప్రొటీన్లు మాత్రమే కాకుండా కాల్షియం, ఫాస్పరస్, సెలీనియం, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పనీర్ తీసుకోవడం వల్ల ఎముకలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. అయితే పనీర్ వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనప్పటికీ.. ఎక్కువ పనీర్ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుందని మీకు తెలుసా.. ముఖ్యంగా ఈ పనీర్ ను కొంతమంది వ్యక్తులు ఎక్కువగా తీసుకోకూడాదు. ఎవరో ఈరోజు తెలుసుకుందాం..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డాక్టర్ ఓ.పి. పనీర్‌ను సమతుల్య పరిమాణంలో తింటే అది లాభదాయకమని, అయితే అధిక కొవ్వు గల చీజ్‌ను ఎక్కువ పరిమాణంలో తింటే అది హానిని కూడా కలిగిస్తుందని దధీచ్ చెప్పారు.
పనీర్ తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:
డయేరియా సమస్య: పనీర్ ప్రోటీన్ మంచి మూలం. ఈ ప్రొటీన్ శరీరంలో అధికంగా ఉంటే.. ఆ వ్యక్తికి డయేరియా సమస్య ఏర్పడవచ్చు. కనుక ఎంత ఇష్టమైన సరే ఒకేసారి ఎక్కువ పనీర్ తీసుకోవడం మానుకోండి.
రక్తపోటు: మీరు రక్తపోటు ఉన్న రోగి అయితే మీరు పనీర్ తినకూడదు. కాటేజ్ చీజ్(పాల విరుగుడు) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని భావించినప్పటికీ.. దానిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
జీర్ణక్రియపై చెడు ప్రభావం: ఎవరైనా జీర్ణక్రియ, మలబద్ధకం, అసిడిటీకి సంబంధించిన ఏదైనా సమస్య బాధపడుతుంటే.. అటువంటి వారు రాత్రి నిద్రపోతున్నప్పుడు పనీర్ తినకండి. ఎక్కువ పరిమాణంలో పనీర్ ను తినడం వల్ల.. అటువంటి వారికి ఎసిడిటీ తో పాటు కొన్నిసార్లు మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.
ఇన్ఫెక్షన్: చాలా మంది పచ్చి పనీర్ తినడానికి చాలా ఇష్టపడతారు. తరచుగా ఈ పాల విరుగుడుని తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇలా ఎక్కువ మొత్తంలో పచ్చి పనీర్ ను తినడం వలన ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఫుడ్ పాయిజనింగ్: కొన్ని రకాల ఆహారపదార్ధాలను తింటే పడని వారు కూడా పనీర్ తినకూడదు. పనీర్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల సమస్యను మరింత తీవ్రతరం అవుతుంది.
గుండె జబ్బులు: పనీర్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలెర్జీలు: మీకు పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు.. పనీర్ ను తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటు, చెడిపోయిన లేదా బాగా నిల్వ ఉండే పనీర్ వల్ల .. చర్మ అలెర్జీలు ఏర్పడవచ్చు. కనుక పనీర్ కొనుగోలు చేసే ముందు తగిన శ్రద్ధ వహించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ( ఇందులోని అంశాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. పాటించే ముందు ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)