Breast Milk: తల్లిపాలపై శాస్త్రజ్ఞుల పరిశోధన.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయంటూ..

తమ పరిశోధనలో తల్లిపాలల్లో పాలిథీన్, పీవీసీ, పాలీప్రొపిలీన్ అనే 3 రకాల ప్లాస్టిక్స్ శాంపిల్స్ ఉన్నట్లు వెల్లడైందని శాస్త్రజ్ఞులు చెప్పారు. శిశువుల హానికలిగించే మైక్రోప్లాస్టిక్స్ విషయంపై ఆందోళన పెరుగుతోందని.. ఈ విషయంపై మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు

Breast Milk: తల్లిపాలపై శాస్త్రజ్ఞుల పరిశోధన.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయంటూ..
Microplastics In Breast Milk
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2022 | 7:28 PM

ప్లాస్టిక్ పర్యావరణంతో పాటు.. మానవ జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న సంగతి తెలిసిందే. నీరు, తినే ఆహారం ద్వారా మానవ శరీరమలోకి ప్లాస్టిక్ అవశేషాలు చేరుతున్నాయని ఇప్పటికే అనేక మంది శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత దూరంగా ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు తల్లిపాలలోనూ మైక్రోప్లాస్టిక్స్ (5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పొడవుండే ప్లాస్టిక్ ముక్కలు) ఉన్నట్లు ఇటలీ సైంటిస్టుల రీసెర్చ్ లో వెల్లడైంది. అవును శాస్త్రవేత్తలు మొదటిసారిగా మానవ తల్లి పాలలో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు. నవజాత శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన తాజా పరిణామాల గురించి పరిశోధకులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇటలీలో రోమ్ లో 34 మంది ఆరోగ్యవంతులైన తల్లుల పాల శాంపిళ్లను సేకరించిన ‘మర్చీ పాలిటెక్నిక్ యూనివర్సిటీ’ సైంటిస్టులు ఆ శాంపిళ్లను స్టడీ చేశారు. వారిలో 75 శాతం మందికి మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయని ది గార్డియన్ నివేదించింది.

తల్లులు ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ అయిన సీఫుడ్‌, పాలు, ఫుడ్, పానీయాల వినియోగాన్ని పర్యవేక్షించారు. అలాగే ప్లాస్టిక్ కలిసి ఉండే ఇతర ప్రొడక్టులను, వస్తువుల వాడకం కూడా పర్యవేక్షించారు. అయితే, ఇలాంటి వాటితో సంబంధం లేకుండా అందరు తల్లుల పాలలోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. దీంతో ఫుడ్ ద్వారా మాత్రమే కాకుండా.. పర్యావరణ కాలుష్యం వల్ల కూడా వారిలోకి మైక్రోప్లాస్టిక్స్ చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

తమ పరిశోధనలో తల్లిపాలల్లో పాలిథీన్, పీవీసీ, పాలీప్రొపిలీన్ అనే 3 రకాల ప్లాస్టిక్స్ శాంపిల్స్ ఉన్నట్లు వెల్లడైందని శాస్త్రజ్ఞులు చెప్పారు. శిశువుల హానికలిగించే మైక్రోప్లాస్టిక్స్ విషయంపై ఆందోళన పెరుగుతోందని.. ఈ విషయంపై మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయినప్పటికీ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని చిన్నారులకు తల్లిపాలను ఇవ్వడం ఆపొద్దని సైంటిస్టులు స్పష్టం చేశారు. “గర్భధారణ, చనుబాలిచ్చే సమయంలో ఈ కలుషితాలకు గురికావడాన్ని తగ్గించే మార్గాలను అంచనా వేయడం చాలా కీలకం” అని  చెప్పారు.

ఇవి కూడా చదవండి

కాలుష్యం కలిగించే మైక్రోప్లాస్టిక్‌ల వల్ల కలిగే నష్టాల కంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ అని చెప్పారు.  అంతేకాదు కాలుష్యాన్ని తగ్గించే చట్టాలను ప్రోత్సహించడానికి రాజకీయ నాయకులపై ఒత్తిడి తెచ్చేలా ప్రజల్లో అవగాహన పెంచాలని డాక్టర్ నోటార్‌స్టెఫానో చెప్పారు.

పాలిమర్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, పాలిథిన్, PVC, పాలీప్రొఫైలిన్‌లతో తయారు చేసిన మైక్రోప్లాస్టిక్‌లను కనుగొంది. ఇవన్నీ తరచుగా ప్యాకేజ్ లో కనిపిస్తున్నాయి. అయితే పరిశోధకులు 2 మైక్రాన్ల కంటే చిన్న కణాలను విశ్లేషించలేకపోయారు.. మరిన్ని చిన్న ప్లాస్టిక్ కణాలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. పసిబిడ్డలకు మైక్రోప్లాస్టిక్స్ వల్ల తీవ్ర ముప్పు ఉన్నందున ఈ విషయంపై మరింత విస్తృతస్థాయిలో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..