Khammam: అత్తగారింటికి వచ్చినట్లు వచ్చాడు.. అనుకున్న పని కానిచ్చాడు.. వీడు మామూలు దొంగకాదు.. వీడియో..
ఫస్ట్‌ప్లోర్‌లో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు. మెల్లగా ఇంట్లోకి వెళ్లాడు. ఎవరూ లేరని అనుకున్నాడు. లోపల రూమ్‌లో చూస్తే
అతన్ని చూస్తే దొంగలా అనిపించడం లేదు.. ఏదో అత్తగారింటికి వచ్చినట్లు హాయిగా దర్జాగా వచ్చాడు.. ఇంట్లోకి ప్రవేశించి అటు ఇటు చూశాడు.. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు.. ఓ వృద్ధురాలు పడుకోని ఉండగా.. ఆమె దగ్గరకు వెళ్లి.. బంగారు గొలుసు లాక్కెళ్లాడు.. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ చైన్ స్నాచింగ్ ఘటన తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు ఓ దొంగ ఖమ్మం కమాన్ బజార్‌లోని ఓ ఇంటి లోపలికి ప్రవేశించాడు. అయితే.. ఈ కమాన్ బజార్‌లోని మెయిన్ రోడ్డు అన్నీ షాపులు ఉన్నాయి. అందరూ ఉండగానే.. అతను తన ఇంటిలోకి వెళ్లినట్లు మెల్లగా మెట్లెక్కి లోపలికి ప్రవేశించాడు.
అనంతరం.. ఫస్ట్‌ప్లోర్‌లో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు. మెల్లగా ఇంట్లోకి వెళ్లాడు. ఎవరూ లేరని అనుకున్నాడు. లోపల రూమ్‌లో చూస్తే ఓ ముసలావిడ పడుకుంది. ఇంతలోనే ముసలావిడ నిద్రపోతుందని అనుకున్న దొంగ.. మెల్లగా మంచం దగ్గరకు వెళ్లాడు. మెడలో ఉన్న గొలుసు లాక్కుని పారిపోయాడు.
వచ్చిన దారి నుంచే దుండగుడు వెళ్లిపోయాడు. రూమ్‌లో నుంచి ఒక్కసారి పరుగు పెట్టిన దొంగ.. మెట్ల దిగి కిందకు వచ్చేసరికి మాత్రం స్పీడ్ తగ్గాడు. అందరూ చూస్తున్నారు అనుకున్నాడో.. ఏమో మెల్లగా నడుచుకుంటూ వచ్చిన దారి వైపే మెల్లగా వెళ్లాడు. అయితే.. వృద్ధురాలి దగ్గర కొట్టేసిన గొలుసు విలువ రెండు లక్షల రూపాలయకు పైగానే ఉంటుందని పోలీసుల పేర్కొంటున్నారు. సీసీ కెమెరాకు చిక్కిన ఈ చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాలో రికార్డియన దృశ్యాలను పరిశీలిస్తే.. తెలిసిన వారే దొంగతానానికి పాల్పడినట్లు అర్ధమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ.. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..