Pawan Kalyan: జనంలోకి జనసేనానీ.. బస్సు యాత్రకు భారీ ఏర్పాట్లు.. పవన్ కోసం ప్రత్యేక వాహనం..

 జనసేనాని యాత్ర కోసం సిద్ధమవుతున్న ఈ వాహనాన్ని మొదట పుణెలో రెడీ చేద్దామని భావించారు పార్టీ నేతలు. కాని పవన్ సూచనలతో హైదరాబాద్‌లో సిద్దమవుతుంది ఈవాహనం.

Pawan Kalyan: జనంలోకి జనసేనానీ.. బస్సు యాత్రకు భారీ ఏర్పాట్లు.. పవన్ కోసం ప్రత్యేక వాహనం..
Pawan Kalyan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 13, 2022 | 6:27 PM

జనంలోకి వెళ్లేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టబోయే.. బస్సు యాత్ర మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే బస్సును ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ బస్సు పనులు చకచకా సాగుతున్నాయి. సేనాని యాత్ర కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేస్తోంది జనసేన. మెరుగైన హంగులతో రూపుదిద్దుకుంటున్న వాహనాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. యాత్రకు అవసరమైన కొన్ని మార్పులు, సూచనలు చేశారు పవన్. జనసేనాని యాత్ర కోసం సిద్ధమవుతున్న ఈ వాహనాన్ని మొదట పుణెలో రెడీ చేద్దామని భావించారు పార్టీ నేతలు. కాని పవన్ సూచనలతో హైదరాబాద్‌లో సిద్దమవుతుంది ఈవాహనం. సేనాని స్వీయ పరిశీలన, సూచనలతో ప్రచార రథం సంసిద్ధమవుతున్నట్లు పార్టీ క్యాడెర్ చెప్తుంది. సినిమా క్యారీ వ్యాన్‌లా కాకుండా.. ప్యూర్ పొలిటికల్ మోడల్‌తో ప్రచార రథం రెడీ అవుతుందని చెప్తున్నారు. ఈ ప్రత్యేక వాహనంలో కనీసం ఆరుగురు కూర్చుని చర్చించుకునేలా కన్వెట్టబుల్ సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. వాహనం చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి.

హై సెక్యూరిటీ సిస్టమ్ విత్ జీపిఎస్ ట్రాకింగ్ ఫిట్ చేస్తున్నారు. అలాగే వాహనం టాప్ పైకి పవన్ చేరేందుకు లోపల నుండే పవర్ లిఫ్ట్ సిస్టమ్ ఏరేంజ్ చేస్తున్నారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు పవన్ ప్రజలందరికి కనిపంచేలా సరికొత్త డిజైన్‌ను.. అలాగే లేటెస్ట్ సౌండ్ సిస్టం, లైటింగ్ సిస్టం ఫిట్ చేస్తున్నారు. మిలటరీ కి చెందిన రంగును ఈ వాహనానికి వాడబోతున్నారు. అచ్చం మిలటరీ వాహనం మాదిరిగానే పవన్ యాత్ర చేయబోయే వాహనానికి తుది మెరుగులు దుద్దుతున్నారు. ఈ వాహనం నుంచి పవన్ నేరుగా టాప్ మీదకు వెళ్లే విధంగా ఏర్పాట్లు, అలాగే వాహనం బాడీకి రెండు వైపులా గార్డులు నిలబడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ యాత్ర రథాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తుండడంతో దీనిని ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తి పవన్ అభిమానుల్లోనూ, జనాల్లోనూ నెలకొంది.

వాస్తవానికి.. అక్టోబర్ 5 నుంచి ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని జనసేన అధినేత నిర్ణయించారు. విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ సైతం ప్రకటన చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇది త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల పాటు ప్రజల్లోనే ఉండేలా పవన్ జిల్లాల పర్యటన ఉండనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..