Hyderabad: యువతులకు కొత్త తరహా వేధింపులు.. అబ్బాయితో కనిపిస్తే చాలు.. వీడియో తీసి..

ఫేక్ అకౌంట్లతో మోసాలు చేయడం.. సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేసి అసభ్యకర పోస్టులు పెట్టడం కామన్ అనుకున్నారేమో.. హైదరాబాద్‍‌లో కొత్త తరహా నేరానికి పాల్పడుతుందో గ్యాంగ్.

Hyderabad: యువతులకు కొత్త తరహా వేధింపులు.. అబ్బాయితో కనిపిస్తే చాలు.. వీడియో తీసి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 13, 2022 | 6:03 PM

ఫేక్ అకౌంట్లతో మోసాలు చేయడం.. సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేసి అసభ్యకర పోస్టులు పెట్టడం కామన్ అనుకున్నారేమో.. హైదరాబాద్‍‌లో కొత్త తరహా నేరానికి పాల్పడుతుందో గ్యాంగ్. ఇన్‌స్టాగ్రామ్‌లో జముండా-అఫిషియల్ పేరుతో ఓ ముఠా పేట్రేగిపోతోంది. ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తు వీడియోలు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఒక వర్గం యువతులు.. రోడ్ల పై ఎక్కడైనా యువకుడితో కనిపిస్తే వీడియోలు తీసి.. అభ్యంతరకరంగా పోస్ట్‌లు పెడుతోంది. తమ కమ్యూనిటీనీ డామేజ్ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్ లైన్ కూడా ఇస్తున్నారు.

జముండా అఫిషియల్ (jhamunda_official) పేరుతో ఇన్‌స్టాలో అకౌంట్ రన్ అవుతోంది. దీనికి 12 వేల మంది ఫాల్లోవర్లు కూడా ఉన్నారు. ఈ జముండా పేజ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. మొత్తం 900 మంది యువతుల వీడియోలు తీసే పనిలో ఉన్నట్టు.. లేటెస్ట్‌గా అడ్మిన్ స్టేటస్ పెట్టారు. దీంతో వీరి ఆగడాలు తట్టుకోలేక కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు.. 506, 509,354(d) సెక్షన్ల కింద జముండా అఫిషియల్ పేజ్‌పై కేసులు నమోదు చేశారు. ఈ పేజ్‌ని ఎవరు నిర్వహిస్తున్నారు. ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో వాళ్లు ఈ పనులు చేస్తున్నారనే దానిపై ఎంక్వైరీ జరుగుతోంది.

అంతకుముందు కూడా ‘ఝాముండా_అఫీషియల్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీపై కేసులు నమోదయ్యాయి. దంపతుల ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ బృందం విచారణ ప్రారంభించింది. ఈ పేజీపై ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..