AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

God Father: నయనతార మా సినిమాకు ప్రధాన ఆకర్షణ.. అందుకే సల్మాన్‌ను తీసుకున్నాం.. మెగాస్టార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ పొలిటికల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లను దాటేసిన ఈ సినిమాను మరింతగా ప్రమోట్‌ చేస్తున్నారు మూవీ మేకర్స్‌.

God Father: నయనతార మా సినిమాకు ప్రధాన ఆకర్షణ.. అందుకే సల్మాన్‌ను తీసుకున్నాం.. మెగాస్టార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Godfather Movie
Basha Shek
|

Updated on: Oct 13, 2022 | 9:58 PM

Share

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సౌత్‌తో పాటు నార్త్‌ ఆడియెన్స్‌ కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ పొలిటికల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లను దాటేసిన ఈ సినిమాను మరింతగా ప్రమోట్‌ చేస్తున్నారు మూవీ మేకర్స్‌. ఇందులో భాగంగా సక్సస్‌మీట్‌లు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ ను మెగాస్టార్ చిరంజీవి మీడియా తో పంచుకున్నారు. గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా సత్యదేవ్ , పూరి జగన్నాథ్ , సర్వదమన్ బెనర్జీ పాత్రల ఎంపికపై స్పందిస్తూ.. ‘సర్వదమన్ బెనర్జీ ఇందులో సీఎం పోషించారు. ఆయనైతే ఈ పాత్రకు బావుటుందని అనుకున్నాం. అయితే తను చాలా కాలంగా నటనకు దూరంగా వున్నారు. మా కోరిక మేరకు నటించడానికి ఒప్పుకున్నారు. ఆ పాత్ర అద్భుతంగా వచ్చింది. ఇక పూరి జగన్నాథ్ కూడా అంతే. ఇందులో యూట్యూబర్ పాత్రలో నటించమని అడిగితే మొదట టెన్షన్ పడ్డారు. తర్వాత ఒప్పుకున్నారు. జైల్లో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్ అతని కోరిక మీద నుండి వచ్చిందని అనుకోవచ్చు.

నయనతార ఈ కథకు ప్రధాన ఆకర్షణ..

‘ ఇక సత్యదేవ్ చాలా ప్రతిభ వున్న నటుడు. ఈ పాత్ర చేయమని నేనే తనకి కథ చెప్పా. తను షాక్ అయ్యాడు. మీరు చేయమని అడిగితే చేసేస్తాను అన్నయ్య నాకు ఎందుకు కథ చెబుతున్నారు.. నాకు అంతా బ్లాంక్ గా వుంది అన్నాడు. వావ్ అనేలా తన పాత్ర చేశాడు. తన ప్రజంటేషన్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. నయనతార ఈ కథకు మరో ఆకర్షణగా నిలిచారు. చాలా అద్భుతంగా చేసింది. ఇందులో నాకు సేనాపతిగా కనిపించే పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించారు. మోహన్ రాజా సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని అన్నారు. చరణ్ బాబు సల్మాన్ తో మాట్లాడారు. సల్మాన్ మాపై ఎంతో ప్రేమతో మరో ఆలోచన లేకుండా చిరు గారు కోరితే నేను నటించడానికి రెడీ’ అని చెప్పారు.

ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు..

ఇక సినిమాల్లో పాటలు, డ్యాన్సులు లేకుండడంపై మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల అభిరుచి కాలనికి తగ్గుట్టు మారుతోంది. బలమైన కథనం వుంటే పాటలు, ఫైట్లు లేకపోయినా ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మార్పుకి తగ్గట్టుగానే గాడ్ ఫాదర్ ని రూపొందించాం. ప్రేక్షకులు దీనిని గొప్పగా ఆదరిస్తున్నారు. మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు రావడానికి ఇది మంచి సంకేతంగా భావిస్తున్నాను. భవిష్యత్ లో కూడా వైవిధ్యమైన కథలు, పాత్రలు చేయాలని ప్రయత్నిస్తాను’ అని తెలిపారు. ఇక ఫ్యూచర్‌ ప్రాజెక్టులు, సేవా కార్యక్రమాలపై స్పందిస్తూ.. మైత్రీ మూవీ మేకర్స్ , బాబీ దర్శకత్వంలో రాబోతున్న 154లో నా నుండి కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ వుండే చిత్రంగా ఆకట్టుకుంటుంది. అలాగే భోళా శంకర్ లో కూడా మంచి మార్పులతో అద్భుతమైన వినోదం వుంటుంది. ప్రేక్షకులు, ఇండస్ట్రీ నన్ను ఎంతగానో ఆదరించింది. వారు ఇచ్చిన ప్రేమ,అభిమానంతోనే ఈ స్థాయిలో వున్నాను. వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే వుంటాను. ఆ కృతజ్ఞతని మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో తీర్చుకోవాలని ప్రయత్నిస్తాను. కృతజ్ఞత తీర్చుకునే విధానంలో ఈ భాద్యతలు నిర్వహిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక చివరిగా యువ దర్శకులతో పని చేయడం గురించి మాట్లాడుతూ ‘ ఇప్పుడున్న యువ దర్శకులకు అన్ లిమిటెడ్ సమాచారం వుంది. కొత్త విషయాలని చాలా చక్కగా అపరిమితంగా నేర్చుకుంటున్నారు. వారికీ కోరుకున్నది ప్రజంట్ చేయడానికి పుష్కలమైన అవకాశాలు వున్నాయి. నా ఇమేజ్, వారు కొత్త గా చూపించే విధానం ఈ కాంబినేషన్ బావుంటుందని నమ్ముతాను. అందుకే యువ దర్శకులతో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతాను’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.