Vishnu Manchu: మా సభ్యులకు మంచు విష్ణు సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే అనర్హులవుతారు అంటూ..
మంచు విష్ణుకు ప్రత్యర్థిగా నటుడు ప్రకాష్ రాజ్ నిలుచున్నా విషయం తెలిసిందే. ఆసమయంలో ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీజరిగింది. అలాగే ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే జరిగింది. ఎట్టకేలకు ఆ ఎన్నికల్లో మంచు విష్ణు విజేతగా గెలిచి. మా అధ్యక్షుడు అయ్యారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎంపిక అయ్యి నేటికీ ఒక ఏడాది పూర్తయ్యింది. ఈ సదంర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇక గత ఏడాది ఇదే సమయానికి మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపించాయి. మంచు విష్ణుకు ప్రత్యర్థిగా నటుడు ప్రకాష్ రాజ్ నిలుచున్నా విషయం తెలిసిందే. ఆసమయంలో ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీజరిగింది. అలాగే ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే జరిగింది. ఎట్టకేలకు ఆ ఎన్నికల్లో మంచు విష్ణు విజేతగా గెలిచి. మా అధ్యక్షుడు అయ్యారు. తాజాగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. “2021 మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి అన్నారు. అక్టోబర్ 13న మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది అన్నారు. అలాగే..
నేను మా అసోసియేషన్ కు మాత్రమే కాదు ప్రేక్షకులకు కూడా నేను జవాబుదారినే.. మా ఎన్నికల్లో నేను చేసిన వాగ్ధానాలు 90 శాతం పూర్తయ్యాయి. సంక్రాంతి తర్వాత మా యాప్ ను తీసుకొస్తాం అన్నారు విష్ణు. అలాగే నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్ లెట్ తయారుచేశాం. నటీనటులు రెండు సినిమాల్లో నటించి విడుదలైతేనే మాలో శాశ్వత సభ్యత్వం కలిపిస్తాం అన్నారు. కనీసం 5 నిమిషాలైన సినిమాలో కనిపించి డైలాగు చెప్పిన వాళ్లకు అసోసియేట్ సభ్యత్వం ఉంటుందన్నారు. అసొసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు అన్నారు. మా అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. మా అసోసియేషన్ సభ్యత్వాన్ని కఠినంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
అదేవిధంగా మా అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్నవాళ్లే సినిమాల్లో నటించాలని నిర్మాతలకు సూచించాం అన్నారు విష్ణు. నిర్మాతల మండలి కూడా మా సూచనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.. మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఏ నటీనటులైన, కార్యవర్గ సభ్యులెవరైనా ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లిన వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం అని విష్ణు వార్నింగ్ ఇచ్చారు విష్ణు. అలాగే ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని.. మా కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు అనర్హులవుతారు అని అన్నారు మంచు విష్ణు. అలాగే మా బిల్డింగ్ గురించి మా సభ్యులకు రెండు ఆప్షన్లు ఇచ్చాను.. సభ్యులందరూ ఫిలిం ఛాంబర్ లో కట్టబోయే నూతన భవనంలోనే మా ఆఫీస్ ఉండాలని కోరుకుంటున్నారు. సభ్యులు అందరి కోరిక ప్రకారం ఫిల్మ్ ఛాంబర్ లో కట్టబోయే నూతన భవనంలో నా సొంత డబ్బులతో ఆఫీస్ స్పేస్ కొని ఇస్తాను అన్నారు మంచు విష్ణు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.