Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: “నా మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారు”.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. కానీ ఒరిజినల్ కంటే ఈ సినిమా బాగుందని అంటున్నారు ప్రేక్షకులు. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు

Chiranjeevi: నా మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 13, 2022 | 8:37 PM

మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా ఇప్పుడు థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు. ఆచార్య సినిమా నిరాశపరచడంతో డల్ అయిన ఫ్యాన్స్ కు ఇప్పుడు గాడ్ ఫాదర్ గా సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు చిరు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. కానీ ఒరిజినల్ కంటే ఈ సినిమా బాగుందని అంటున్నారు ప్రేక్షకులు. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. పొలిటికల్ నేపథ్యంలో ఉన్న ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ ను మెగాస్టార్ చిరంజీవి మీడియా తో పంచుకున్నారు. గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించడం సంతోషంగా ఉంది అన్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకంతో ఈ సినిమా చేశామని అన్నారు చిరు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..

మా తమ్ముడి తో చేయాలనే సరదా నాకు వుంటుంది. అన్నయ్యతో చేయాలని తనకీ వుంటుంది. అన్నీ కుదిరిన రోజున కలసి సినిమా చేయాలనీ నాకు చాలా ఉత్సాహంగా వుంది. దర్శకులు సెట్స్ లో డైలాగులు రాస్తన్నారని ఆమధ్య నేను అన్న మాటలు వైరల్ అయ్యాయి. నేను ఆ మాటలు ఈ మధ్య అనలేదండీ. నేను జనరల్ గా ఆ మాట అన్నాను. కానీ దానిని వేరేలా ఆపాదించుకున్నారు. నేను ఏ సినిమాని ఉద్దేశించి ఆ మాట చెప్పలేదు. జనరల్ గా ఇలాంటి పరిస్థితి వుందని చెప్పడమే నా ఉద్దేశం. గాడ్ ఫాదర్ విషయానికి వస్తే మోహన్ రాజా అద్భుతమైన ప్రీప్రొడక్షన్ వర్క్ చేశారు.దాని వలన సమయం, డబ్బు రెండూ కలిసొస్తాయి అని అన్నారు.

ఇతర భాష హీరోల సినిమాలు చేస్తారా అన్న ప్రశ్నకు.. తప్పకుండా చేస్తాను. అందరూ చేయాలని కోరుతాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా ‘ఇండియన్ సినిమా’ అనే పేరు రావాలని నా కోరిక. బాహుబలి, కే జీ ఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఎల్లలు చేరిగిపోయాయనే భావిస్తాను. ఇది మంచి పరిణామం అన్నారు. ఇక ఈ మధ్య మీరు తగ్గారు అని కొందరు అంటున్నారు అని ప్రశ్నించగా.. ఇక్కడ తగ్గడం అని కాదు. సంయమనం పాటించడం. నిజాలు నిలకడగా తేలుస్తుందనే మాటని నమ్మేవాడిని నేను. ఇది నమ్మాను కాబట్టే.. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్ళీ వారి తప్పుని తెలుసుకొని నా దగ్గరికి వస్తే వారిని ప్రేమగా దగ్గర తీసుకోవడమే నాకు తెలిసిన ఫిలాసఫీ. ఎంతమంది మనసులకు దగ్గరయ్యానన్నదే నాకు ముఖ్యం అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.