Allu Arjun: తగ్గేదేలే.. బన్నీ, రణ్‌వీర్‌లతో బల్లెం వీరుడి డ్యాన్స్‌.. హంగామా మాములుగా లేదుగా

కాగా ఈ ఈవెంట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో బన్నీ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెల్చుకున్నాడు. పుష్ప సినిమాకు గానూ ఈ పురస్కారం లభించింది. అదేవిధంగా క్రీడా విభాగంలో నీరజ్‌ చోప్రా అవార్డును అందుకున్నాడు. కాగా బన్నీ, బల్లెం వీరుడు ఒకే వేదికను పంచుకోవడంతో ఈవెంట్‌లో సందడి వాతావరణం నెలకొంది.

Allu Arjun: తగ్గేదేలే.. బన్నీ, రణ్‌వీర్‌లతో బల్లెం వీరుడి డ్యాన్స్‌.. హంగామా మాములుగా లేదుగా
Neeraj Chopra, Allu Arjun,
Follow us

|

Updated on: Oct 13, 2022 | 2:57 PM

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బుధవారం రాత్రి ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఈవెంట్‌- 2022 వేడుక అట్టహాసంగా జరిగింది. సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. టాలీవుడ్‌ తరఫున అల్లు అర్జున్‌, బాలీవుడ్‌ తరఫున రణ్‌వీర్‌ సింగ్‌తో పాటు బల్లెం వీరుడు, ఒలింపియన్‌ నీరజ్‌ చోప్రా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. కాగా ఈ ఈవెంట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో బన్నీ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెల్చుకున్నాడు. పుష్ప సినిమాకు గానూ ఈ పురస్కారం లభించింది. అదేవిధంగా క్రీడా విభాగంలో నీరజ్‌ చోప్రా అవార్డును అందుకున్నాడు. కాగా బన్నీ, బల్లెం వీరుడు ఒకే వేదికను పంచుకోవడంతో ఈవెంట్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం కబుర్లు చెప్పుకున్నారు. ఈ సందర్భంగానే అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలోని ఐకానిక్‌ డైటాగ్‌ తగ్గేదేలే మేనరిజంను రీక్రియేట్‌ చేశాడు నీరజ్‌. అల్లు అర్జున్‌ కూడా అక్కడే ఉండడంతో ఇద్దరూ కలిసి తగ్గేదేలే అంటూ పోజులిచ్చారు. ఇక ఇదే ఈవెంట్‌లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి డ్యాన్స్‌ చేశాడు నీరజ్‌. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన ఫిలింఫేర్‌ పురస్కారాల్లోనూ పుష్ప సత్తా చాటింది. ఉత్తమ నటుడు అవార్డుతో సహా ఏకంగా 7 అవార్డులు కైవసం చేసుకుంది. ఇక బన్నీ పుష్ప సీక్వెల్ ‘పుష్ప: ది రూల్‌’ కోసం సిద్ధమవుతున్నాడు. దీపావళి తర్వాత ఈ సినిమా షూటింగ్‌ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. రెండో పార్టులో విజయ్‌ సేతుపతి లాంటి పేరొందిన నటులు నటించవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నీరజ్‌ విషయానికొస్తే.. ఇటీవల స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ట్రోఫీని గెల్చుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర కెక్కాడు. వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..