AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa The Rise: పుష్ప2 పట్టాలెక్కేది అప్పుడేనట.. అల్లు అర్జున్ షూటింగ్లో జాయిన్ అయ్యేది ఎప్పుడంటే

రష్మిక మందన్నా హీరోయిన్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళీ స్టార్ ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటించారు.

Pushpa The Rise: పుష్ప2 పట్టాలెక్కేది అప్పుడేనట.. అల్లు అర్జున్ షూటింగ్లో జాయిన్ అయ్యేది ఎప్పుడంటే
Pushpa
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2022 | 5:48 PM

Share

పాన్ ఇండియా మూవీగా రచ్చ చేసిన సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. రష్మిక మందన్నా హీరోయిన్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళీ స్టార్ ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి భాగం సక్సెస్ అవ్వడంతో అభిమానుల్లో నెలకొన్ని బజ్ ని దృష్టిలో పెట్టుకునే రెండవ పార్ట్ కో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు సుకుమార్.

ఈ క్రమంలోనే ఊహించని ట్విస్ట్ లు ఈ సినిమాలో ఉన్నడనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ఫహిద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. అయితే రెండో పార్ట్ లో ఆయనను మరింత క్రూరంగా చూపించనున్నాడట సుకుమార్. అలాగే ఈ పార్ట్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నాడని అంటున్నారు. అయితే ఇప్పుడు అర్జున్ కపూర్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఇప్పటికే అతడితో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో మరో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని.. అయితే ఈ రోల్ కోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకున్నారని.. ఇక చివరి నిమిషంలో అర్జు్న్ కపూర్‏ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీపావళి పండగ తర్వాత నుంచి పుష్ప 2 షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. పండగ తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీనిపై అప్డేట్ రానుంది. పాన్ ఇండియాని మించి పాన్ వరల్డ్ లకి రీచ్ అయ్యేలా కథగా దీనిని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..