God Father: మావయ్య సినిమాపై బన్నీ రివ్యూ.. డైరెక్టర్‌తో ఏం చెప్పారో తెలుసా?

తాజాగా గాడ్‌ ఫాదర్‌ డైరెక్టర్‌ మోహన్‌ రాజా సినిమా విజయానందాన్ని అందరితో షేర్‌ చేసుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఫోన్‌ చేసి మరీ అభినందిస్తున్నారని తెలిపారు

God Father: మావయ్య సినిమాపై బన్నీ రివ్యూ.. డైరెక్టర్‌తో ఏం చెప్పారో తెలుసా?
Chiranjeevi, Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Oct 13, 2022 | 9:01 PM

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌. మోహన్‌ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సూపర్‌డూపర్‌హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్‌ మాస్‌ మేనియా ఫర్మామెన్స్‌ అదిరిపోయిందని అభిమానులు చెబుతున్నారు. పలువురు ప్రముఖులు కూడా చిరంజీవి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గాడ్‌ ఫాదర్‌ డైరెక్టర్‌ మోహన్‌ రాజా సినిమా విజయానందాన్ని షేర్‌ చేసుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఫోన్‌ చేసి మరీ అభినందిస్తున్నారని తెలిపాడు. ‘నాకు మొదట చెర్రీ ఫోన్‌ చేశాడు. అంతేకాక ఉదయం ఆరు గంటలకే నా దగ్గరకు వచ్చి అరగంటసేపు మాట్లాడారు. ఇది చాలు నాకనిపించింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ నాతో 21 నిమిషాలు ఫోన్‌ లో మాట్లాడారు. పిచ్చెక్కించేశారు. మెగా ఫ్యాన్స్‌కు సినిమా లడ్డూలా ఉందన్నారు. సాయిధరమ్‌ తేజ్‌ అయితే ఏకంగా నా ఆఫీస్‌కే వచ్చి కంగ్రాట్స్‌ చెప్పారు’ అని చెప్పుకొచ్చాడు మోహన్‌ రాజా.

కాగా గాడ్‌ఫాదర్‌ సినిమాకు 8 రోజుల్లో 145.24 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాత తెలిపారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మూవీ మేకర్స్ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కాగా ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. సముద్రఖని, పూరిజగన్నాథ్‌, మురళీ శర్మ, సునీల్‌, బ్రహ్మాజి, గంగవ్వ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ అందించిన స్వరాలు, బీజీఎమ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేవలం సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..