Divi vadthya: ‘అందుకే నాకు కాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదురు కాలేదు’.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి ఆసక్తికర వ్యాఖ్యలు..

సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పంచుకునే ఈ బ్యూటీ. తన లేటెస్ట్‌ ఫొటోలతో కుర్రకారు గుండెదడ పెంచేస్తుంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ అందాల...

Divi vadthya: 'అందుకే నాకు కాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదురు కాలేదు'.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి ఆసక్తికర వ్యాఖ్యలు..
Divi Comments on casting couch
Follow us

|

Updated on: Oct 14, 2022 | 7:00 AM

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ దివి.. బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు వారిని ఆకర్షించింది. హౌజ్‌లో తనదైన చలాకీ తనం, అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగువారందరికీ సుపరితురాలైంది. ఈ షోలోనే చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది. చిరు హీరోగా ఇటీవల వచ్చిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో దివి నటించిన విషయం తెలిసిందే. ఇందులో రేణుక పాత్రలో నటించిన దివి తొలిసారి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. దీంతో దివి క్రేజ్‌ మరింత పెరిగింది.

ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పంచుకునే ఈ బ్యూటీ. తన లేటెస్ట్‌ ఫొటోలతో కుర్రకారు గుండెదడ పెంచేస్తుంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ అందాల ముద్దుగుమ్మ. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు అప్పట్లో సంచలనం సృష్టించిన కాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై తనదైన శైలిలో స్పందించింది దివి. మోడల్‌గా కెరీర్‌ మొదలు పెట్టి యాక్టర్‌గా ఎదిగే క్రమంలో మీకు ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్‌ వంటి చేదు అనుభవం ఎదురైందా అన్న ప్రశ్నకు దివి సమాధానం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

ఈ విషయమై దివి మాట్లాడుతూ.. ‘ ఇప్పటి వరకు నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చాను. అందుకే నాకు కాస్టింగ్ కౌచ్‌ సమస్య ఎదురుకాలేదు అనుకుంటున్నాను. మన ప్రవర్తన బట్టి ఎదుటివారు ప్రవర్తిస్తుంటారు. వారెవరికీ నా గురించి కానీ, నాతో మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వలేదు. అయితే ఒక అమ్మాయి, అబ్బాయి ఇష్టపడి కమిట్‌ అవ్వడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..