AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs SLW: ఆసియా కప్ ఫైనల్లో స్తతా చాటిన టీమిండియా.. లంకపై ఘన విజయం.. 7వ సారి ట్రోఫీ సొంతం..

రేణుకా సింగ్ వరుసగా 8వ సారి ఫైనల్ ఆడుతున్న భారత జట్టు తరపున 3 వికెట్లు పడగొట్టి, సత్తా చాటింది. రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ రాణా కూడా 2 వికెట్లు తీశారు.

INDW vs SLW: ఆసియా కప్ ఫైనల్లో స్తతా చాటిన టీమిండియా.. లంకపై ఘన విజయం.. 7వ సారి ట్రోఫీ సొంతం..
India Women Vs Sri Lanka Wo
Venkata Chari
|

Updated on: Oct 15, 2022 | 3:29 PM

Share

ఉమెన్స్ ఆసియా కప్ 2022లో టీమిండయా అద్భుత ఆటతో ఆకట్టుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఘన విజయంతో 7వ సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఆకట్టుకుంది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లాడిన టీమిండియా 6 విజయాలు సాధించింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. భారత జట్టుకు ఇది 7వ ఆసియా టైటిల్. వరుసగా 6 టైటిల్స్ నెగ్గిన సంగతి తెలిసిందే. తొలుత 65 పరుగుల స్వల్ప స్కోరు వద్ద శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను టీమ్ ఇండియా నిలువరించింది. అనంతరం 8.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేరింది. భారత్ తరపున రైట్ ఆర్మ్ మీడియం పేసర్ రేణుకా సింగ్ 3 వికెట్లు పడగొట్టింది. కాగా స్మృతి మంధాన 51 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 25 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో 200కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకుంది. అదే సమయంలో ఇనోకా రన్వెరా శ్రీలంక తరపున అత్యధికంగా 18 పరుగులు చేసింది. ఒషాది రణసింగ్ 13 పరుగులు జోడించింది. వీరిద్దరూ జట్టు స్కోరును 50కి చేర్చారు.

శ్రీలంకపై 5వ ఫైనల్‌..

శ్రీలంకతో జరిగిన 5వ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 5 ఫైనల్స్ జరిగాయి. వీటన్నింటిలో టీమిండియా విజయం సాధించింది. భారత జట్టు వరుసగా ఎనిమిదోసారి ఫైనల్ చేరింది.

ఇరు జట్లు:

భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దీప్తి శర్మ, రిచా ఘోష్ (w), పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్

శ్రీలంక మహిళలు (ప్లేయింగ్ XI): చమరి అతపత్తు(సి), అనుష్క సంజీవని(w), హర్షిత మాదవి, హాసిని పెరీరా, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, మల్షా షెహాని, ఓషాది రణసింగ్, సుగండిక కుమారి, ఇనోకా రణవీర, అచ్చిని కులసూర్య

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు