Jabardasth Apparao: జగన్‌కు జై కొట్టిన జబర్దస్త్ అప్పారావు.. ఆ విషయంలో ఫుల్‌ సపోర్ట్‌ అంటూ వీడియో హల్‌చల్‌

ప్రముఖ జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా మూడు రాజధానులకు తన మద్దతును ప్రకటించాడు. ఈ విషయంలో జగన్‌ సర్కారుకే జై కొడుతూ ఒక వీడియోను విడుదల చేశారు.

Jabardasth Apparao: జగన్‌కు జై కొట్టిన జబర్దస్త్ అప్పారావు.. ఆ విషయంలో ఫుల్‌ సపోర్ట్‌ అంటూ వీడియో హల్‌చల్‌
Cm Jagan, Apparao
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2022 | 7:15 PM

ప్రస్తుతం ఏపీలో రాజధాని ఉద్యమం పొలిటికల్‌ హీట్ పెంచుతోంది. సీఎం జగన్‌ సర్కారు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాల్సిందేనని కృత నిశ్చయంతో ఉండగా.. ప్రతిపక్షాలు మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలంటూ తెగేసి చెబుతున్నారు. కాగా మూడు రాజధానులకు మద్దతుగా శనివారం (అక్టోబర్‌15) విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రలు, వైసీపీ నేతలు పిలుపునిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా మూడు రాజధానులకు తన మద్దతును ప్రకటించాడు. ఈ విషయంలో జగన్‌ సర్కారుకే జై కొడుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘ మన విశాఖ- మన రాజధానికి పేరిట జరగబోయే విశాఖ గర్జనకు అందరూ మద్దతు తెలపాలి. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని ఒక కళాకారుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మహా కార్యంలో పాల్గొనే వారికి మద్దతు ఇచ్చే వారికి నా ధన్యవాదాలు. అందరూ వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వాలని కోరారు. నేను కూడా శనివారం విశాఖ వస్తున్నాను. మీరు కూడా తప్పకుండా రావాలి’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు అప్పారావు.

కాగా నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ అప్పారావు నిర్ణయాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతిస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారు మాత్రం అప్పారావుపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. నటుడిగా వేషాలు వేసుకోక నీకెందుకీ గోల అంటూ కామెంట్లు పెడుతున్నారు. జబర్దస్త్‌ కామెడీతో బాగా పాపులర్‌ అయ్యారు అప్పారావు. విశాఖపట్నం జిల్లాలోని అక్కాయపాలెంకు చెందిన ఆయన పలు సినిమాలు, సీరియల్స్‌లో కూడా నటించారు. చందమామా, నేనింతే, మహాత్మ, వేదం తదితర సినిమాల్లో ఆయన కనిపించారు. 2017లో జబర్దస్త్‌ షోలోకి అడుగుపెట్టి తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అయితే ఈయన మూడు రాజధానులకు జై కొట్టడం ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..