AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: పంచెకట్టి మాస్‌ స్టెప్పులు వేసిన కళావతి.. ధూమ్ ధామ్ దోస్తాన్ అంటూ..

అచ్చం తెలంగాణ యాసలో సాగే ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. ముఖ్యంగా పంచెకట్టులో నాని చేసిన మాస్‌ డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా కీర్తి సురేశ్‌ కూడా నాని పాటను రీక్రియేట్‌ చేసింది.

Keerthy Suresh: పంచెకట్టి మాస్‌ స్టెప్పులు వేసిన కళావతి.. ధూమ్ ధామ్ దోస్తాన్ అంటూ..
Keerthy Suresh Dance
Basha Shek
|

Updated on: Oct 14, 2022 | 9:08 PM

Share

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం ద‌స‌రా. మహానటితో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా నాని- కీర్తిసురేశ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం దసరా. ఇంతకుముందు వీరిద్దరు జంటగా నటించిన నేను లోకల్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా దసరా సినిమాలో మరోసారి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనునన్నారు నాని- కీర్తి. కాగా ఈ సినిమా నుంచి ఇటీవల ఓ మాస్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అచ్చం తెలంగాణ యాసలో సాగే ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. ముఖ్యంగా పంచెకట్టులో నాని చేసిన మాస్‌ డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా కీర్తి సురేశ్‌ కూడా నాని పాటను రీక్రియేట్‌ చేసింది. లుంగీ కట్టుకుని స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని తన డ్యాన్స్‌ పార్ట్‌నర్‌లతో కలిసి డ్యాన్స్‌ ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘కళావతి (సర్కారు వారి పాటలో కీర్తి పేరు) మళ్లీ అదరగొట్టింది’, ‘మాస్‌ డ్యాన్స్‌ ‘ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా దసరా సినిమాను శ్రీ ల‌క్ష్మి వెంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సాయికుమార్‌, సముద్ర ఖని, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, జ‌రీనా వ‌హ‌బ్, మీరాజాస్మిన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తెలుగుతోపాటు వివిధ భాష‌ల్లోనూ ఈ పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు