AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: దీపావళి‌కు మెగాస్టార్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. సాలిడ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన బాబీ టీమ్

మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా తర్వాత మరికొన్ని..

Chiranjeevi: దీపావళి‌కు మెగాస్టార్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. సాలిడ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన బాబీ టీమ్
Mega 154
Rajeev Rayala
|

Updated on: Oct 14, 2022 | 9:15 PM

Share

చిరంజీవి సినిమా అంటే ఎలా ఉంటుందో మరోసారి చూపించింది గాడ్ ఫాదర్. తనదైన మార్క్ యాక్షన్ తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు చిరు. గాడ్ ఫాదర్ గా ఇప్పుడు థియేటర్స్ ను దున్నేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు లైనప్ చేశారు వాటిలో మెగా 154 ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ల క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా మెగా154′ రూపుదిద్దుకుంటుంది. తాజాగా ‘మెగా154’ టీమ్ ఈరోజు నుండి డబ్బింగ్ ప్రారంభించింది. 2023 సంక్రాంతికి సినిమా విడుదల కానున్న నేపధ్యంలో షెడ్యూల్ ప్రకారం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ‘మెగా154′ టైటిల్ టీజర్ అప్డేట్ కూడా వచ్చింది. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ విడుదల కానుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేస్తూ.. ”బాబీ సర్ కి అభినందనలు . మీ కల నిజం కాబోతుంది. దీపావళికి బాస్ ఎక్సయిటింగ్ టీజర్. నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేసాను. మీ అందరితో కలిసి మెగా మాస్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూడటానికి సంక్రాంతి వరకు ఆగలేకపోతున్నా’ అని వెల్లడించారు.

అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్బస్టర్ ఆల్బమ్ లను అందించిన రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!