AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2022 IND vs PAK: ఇండో-పాక్ మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.. ఆ కీలక ప్లేయర్లకు హ్యాండిచ్చిన ఐసీసీ

India Predicted Playing XI vs PAK: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సంబంధించిన ఈ ఈవెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లన్నింటికీ ICC తన ప్రాబబుల్ ప్లేయింగ్ XIని సిద్ధం చేసింది.

T20 WC 2022 IND vs PAK: ఇండో-పాక్ మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.. ఆ కీలక ప్లేయర్లకు హ్యాండిచ్చిన ఐసీసీ
Team India
Venkata Chari
|

Updated on: Oct 16, 2022 | 6:16 PM

Share

T20 ప్రపంచ కప్ 2022 ప్రారంభమైంది. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్ (శ్రీలంక vs నమీబియా) ఉత్కంఠతో నిండిపోయింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక టీంకు భారీ షాక్ తగిలింది. దీంతో తొలిరోజు తొలి మ్యాచ్‌లోనే రికార్డులు వెల్లువయ్యాయి. ఇక టోర్నీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సంబంధించిన ఈ ఈవెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లన్నింటికీ ICC తన ప్రాబబుల్ ప్లేయింగ్ XIని సిద్ధం చేసింది. ఈక్రమంలో ఐసీసీ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు దక్కిందో ఇప్పుడు చూద్దాం..

షమీ, పంత్‌కు దక్కని చోటు..

ఐసీసీ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌లకు చోటివ్వలేదు. రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా దినేష్ కార్తీక్ ఎంపికయ్యాడు. విశేషమేమిటంటే, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. సీనియర్ బౌలర్‌గా, అతని భుజాలపై కీలక బాధ్యతలు ఉన్నాయి.

టాప్ ఆర్డర్‌లో మార్పు లేదు..

జట్టు టాప్ ఆర్డర్‌లో ఎటువంటి మార్పు లేదు. ముందుగా కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కనిపించనున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. అదే సమయంలో మిడిల్ ఆర్డర్‌ను సూర్యకుమార్ యాదవ్‌తో ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఈ స్పిన్నర్లకు దక్కిన చోటు..

ఈ జట్టులో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టుకు దూరంగా ఉంచారు.

ఫాస్ట్ బౌలింగ్‌ బాధ్యతలు వారిపైనే..

టీమ్‌లో ఫాస్ట్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫాస్ట్ బౌలింగ్‌లో ఆడటం కనిపిస్తుంది.

టీమిండియా షెడ్యూల్..

T20 ప్రపంచ కప్ 2022లో భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 23 ఆదివారం మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది.

రెండో మ్యాచ్‌లో క్వాలిఫయర్ టీంతో అక్టోబర్ 27న తలపడనుంది.

మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో అక్టోబర్ 30న తలపడనుంది.

ఇక నాలుగో మ్యాచ్‌కలో బంగ్లాదేశ్‌తో నవంబర్ 2న పోటీపడనుంది.

చివరి మ్యాచ్‌‌లో క్వాలిఫయర్ టీంతో నవంబర్ 6న తలపడనుంది. దీంతో టీమిండియా సూపర్ 12 పోటీలు ముగుస్తాయి.

ICC ఎంపిక చేసిన టీమిండియా ప్లేయింగ్ XI..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్.