T20 World Cup 2022: టీ20ల్లో తుఫాన్ బ్యాటర్స్.. స్ట్రైక్ రేట్ చూస్తే బౌలర్లకు ఫ్యూజులు ఔటే.. లిస్టులో టీమిండియా ప్లేయర్..

ప్రస్తుతం తుఫాన్ బ్యాటర్ల గురించి మాట్లాడితే, T20 క్రికెట్‌లో ఇలాంటి బ్యాట్స్‌మెన్స్ చాలా మంది ఉన్నారు. ఈ T20 ప్రపంచకప్‌లో మరింత దూకుడుగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.

T20 World Cup 2022: టీ20ల్లో తుఫాన్ బ్యాటర్స్.. స్ట్రైక్ రేట్ చూస్తే బౌలర్లకు ఫ్యూజులు ఔటే.. లిస్టులో టీమిండియా ప్లేయర్..
T20 World Cup 2022 Surya Ku
Follow us
Venkata Chari

|

Updated on: Oct 15, 2022 | 8:11 PM

టీ20 ప్రపంచ కప్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. అక్టోబర్ 16 నుంచి క్వాలిఫయర్ పోటీలతో ఈ క్రికెట్ మహాసంగ్రామం మొదలుకానుంది. టీ20 క్రికెట్‌లో తరచుగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయిస్తుండడం మనం చూస్తుంటాం. అయితే, బౌలర్ల కూడా తమదైన రోజున బ్యాటర్ల భరతం పడుతుంటారు. ప్రస్తుతం తుఫాన్ బ్యాటర్ల గురించి మాట్లాడితే, T20 క్రికెట్‌లో ఇలాంటి బ్యాట్స్‌మెన్స్ చాలా మంది ఉన్నారు. ఈ T20 ప్రపంచకప్‌లో మరింత దూకుడుగా కనిపించేందుకు వీరంతా తమ బ్యాట్లకు మరింత పదును పెడుతున్నారు. T20 ఇంటర్నేషనల్‌లో తుఫాన్ బ్యాట్స్‌మెన్స్ ఎవరు, వాళ్ల స్ట్రైక్ రేట్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1. సూర్యకుమార్ యాదవ్ (భారతదేశం)

భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన బ్యాటింగ్‌తో అందరినీ పిచ్చెక్కిస్తున్నాడు. అతని ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలి అందరినీ ఆకట్టుకుంటుంది. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత జట్టులో అంతర్భాగంగా మారాడు. సూర్య ఇప్పటివరకు మొత్తం 34 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇందులో 176.81 స్ట్రైక్ రేట్, 38.70 సగటుతో 1045 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో మరోసారి ఈ టీమిండియా మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ దూకుడు ఆటను చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

2. జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్)

న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ చాలా దూకుడుగా ఆడుతున్నాడు. T20 ప్రపంచకప్‌లో అతని తుఫాన్ బ్యాటింగ్ శైలి తప్పకుండా చూడాల్సిందే. జిమ్మీ ఇప్పటివరకు T20 ఇంటర్నేషనల్స్‌లో మొత్తం 53 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 163.65 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 635 పరుగులు చేశాడు.

3. ఫిన్ అలెన్ (న్యూజిలాండ్)

న్యూజిలాండ్‌లో ప్రస్తుత యువ ఆటగాడు ఫిన్ అలెన్ చాలా అద్భుత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. 23 ఏళ్ల ఫిన్ అలెన్ ఇప్పటివరకు న్యూజిలాండ్ తరపున మొత్తం 18 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అందులో అతను 161.72 స్ట్రైక్‌తో బ్యాటింగ్ చేస్తూ 469 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ తరచుగా ఓపెనింగ్‌లో కనిపిస్తుంటాడు. టీ20 ప్రపంచకప్‌లో అతడు బ్యాటింగ్‌ను చూడాలంటే ఉత్కంఠగా ఉంటుంది.

4. టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా)

రైజింగ్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ మైదానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడల్లా పెద్ద షాట్‌లపై కన్ను వేస్తుంటాడు. ఫ్రాంచైజీ క్రికెట్ గేమ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టిమ్ డేవిడ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను సింగపూర్‌లో ప్రారంభించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. టిమ్ ఇప్పటివరకు మొత్తం 22 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అందులో అతను 160.08 వద్ద బ్యాటింగ్ చేస్తూ 714 పరుగులు చేశాడు.

5. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్‌)

వెస్టిండీస్‌కు చెందిన చాలా మంది బ్యాట్స్‌మెన్లు అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబడుతుంటారు. అదే సమయంలో మరోసారి జట్టులోకి వచ్చిన ఎవిన్ లూయిస్ తన దూకుడు బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఎవిన్ లూయిస్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఫోర్ల కంటే ఎక్కువ సిక్సర్లు బాదేస్తుంటాడు. అతను ఇప్పటివరకు మొత్తం 110 సిక్సర్లు, 106 ఫోర్లు కొట్టాడు. ఇప్పటివరకు మొత్తం 50 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన లూయిస్.. 155.52 స్ట్రైక్‌తో పరుగులు సాధించాడు.

6. రిలే రోస్సో (దక్షిణాఫ్రికా)

ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్ రిలే రోస్సో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరపున మొత్తం 21 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అందులో అతను 37.20 సగటు, 152.87 స్ట్రైక్ రేట్‌తో 558 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో అందరి దృష్టి ఈ ప్లేయర్ బ్యాటింగ్‌పైనే ఉంటుంది.

7. ఐడాన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా)

ఈ రోజుల్లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్ ఐడాన్ మార్క్రామ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ.. దూకుడుగా బ్యాటింగ్ చేయడంలోనూ పేరుగాంచాడు. అతను ఆఫ్రికా తరపున ఇప్పటివరకు మొత్తం 26 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 41.05 సగటు, 151.16 స్ట్రైక్ రేట్‌తో 780 పరుగులు చేశాడు.

8. గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)

ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ లేకుండా పూర్తి కాదు. మాక్స్‌వెల్ తన వేగవంతమైన బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ప్రస్తుతం అతను ఫామ్‌లో లేకపోవడం కాస్తంత నిరాశే. అయితే T20 ప్రపంచ కప్‌లో అందరి దృష్టి అతనిపైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు మొత్తం 94 టీ20 ఇంటర్నేషనల్‌లు ఆడాడు. 150.40 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.