AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: క్రికెట్‌లో తనకు రోల్ మోడల్ ఎవరో రివీల్ చేసిన మిస్టర్ కూల్..

MS Dhoni: ఓ చిన్నారి అడిగిని ప్రశ్న చూసి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆన్సర్ విన్న తర్వాత పిల్లలు కూడా తెగ నవ్వేశారు.

Watch Video: క్రికెట్‌లో తనకు రోల్ మోడల్ ఎవరో రివీల్ చేసిన మిస్టర్ కూల్..
Ms Dhoni
Venkata Chari
|

Updated on: Oct 16, 2022 | 12:48 PM

Share

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే సందడి చేస్తున్నాడు. ఏడాది పొడవునా ఫీల్డ్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే, ధోని సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటుంటాడు. అయినప్పటికీ, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎప్పటికీ తగ్గడం లేదు. అన్ని సమయాలలోనూ సోషల్ మీడియాలో ఆధిపత్యం చెలాయించేలా చేస్తుంటారు. ధోనీ ఇటీవల తన పేరు మీద ఉన్న గ్లోబల్ స్కూల్‌కు చేరుకుని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

అమ్మాయి ప్రశ్నకు ధోనీ ఫన్నీ ఆన్సర్..

చెన్నై సూపర్ కింగ్స్ ధోనీకి సంబంధించిన వీడియోను పంచుకుంది. ఇక్కడ భారత మాజీ కెప్టెన్ పాఠశాల పిల్లలతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఈ స్టార్ క్రికెటర్‌కి ఏ సబ్జెక్ట్‌ బాగా నచ్చిందంటూ ఓ చిన్న అమ్మాయి ధోనిని అడిగింది. ఈ ప్రశ్న విన్న వెంటనే ధోనీకి నవ్వు వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘క్రీడలను సబ్జెక్ట్‌గా పిలుస్తా. నేను సగటు విద్యార్థిని. నేను కేవలం ఏడేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతున్నాను. అందుకే నేను చాలా అరుదుగా క్లాసులో ఉండేవాడిని. అయినా నేను మంచి విద్యార్థినే. 10వ తరగతిలో 66 శాతం మార్కులు, 12లో 56 శాతం మార్కులు వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

10లో పాస్ అవుతానని మా నాన్నకు నమ్మకం లేదు..

ఈ జార్ఖండ్ డైనమేట్ 10వ తరగతి పాస్ అవుతాడన్న నమ్మకం తన తండ్రికి లేదని ధోనీ పిల్లలకు తెలిపాడు. ‘నేను 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించలేనని మా నాన్న భావించారు. అందుకే బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉంది. నాకు 10వ తరగతిలో 66 శాతం, 12వ తరగతిలో 56 లేదా 57 శాతం మార్కులు వచ్చాయి’ అంటూ స్టూడెంట్స్‌తో తన చిన్ననాటి సంగతులు పంచుకున్నాడు.

పాఠశాల రోజులను గుర్తు చేసుకున్న ధోని..

అందరిలాగే, ధోనీ కూడా పాఠశాల సమయమే ఉత్తమ సమయం అని నమ్ముతాడు. ఆయన మాట్లాడుతూ, ‘నేను ఏ పాఠశాలకు వెళ్లినా, నేను టైమ్ మెషీన్‌కు చేరుకున్నట్లు అనిపిస్తుంది. అయితే, అందులో చదువులతోపాటు క్రీడలు కూడా ఉన్నాయి. కానీ, బడిలో గడిపిన కాలం తిరిగి రాదు. మీకు జ్ఞాపకాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూసే స్నేహితులు మీ జీవితాంతం మీతో ఉంటారు’ అంటూ ముగించాడు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!