T20 World Cup 2022: కొత్త నిబంధనలతో తస్మాత్ జాగ్రత్త.. ఆ క్షణంలో ఇబ్బంది పెట్టే ఛాన్స్.. హెచ్చరించిన ఐసీసీ

అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లను మ్యాచ్ సందర్భంగా కొత్త నిబంధనలను గుర్తుంచుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం హెచ్చరించింది.

T20 World Cup 2022: కొత్త నిబంధనలతో తస్మాత్ జాగ్రత్త.. ఆ క్షణంలో ఇబ్బంది పెట్టే ఛాన్స్.. హెచ్చరించిన ఐసీసీ
Icc T20 World Cup 2022
Follow us
Venkata Chari

|

Updated on: Oct 12, 2022 | 7:29 PM

ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరించింది. మ్యాచ్ సందర్భంగా కొత్త నిబంధనలను గుర్తుంచుకోవాలని బుధవారం కోరింది. T20 క్రికెట్ ఎంతో ఉత్సాహవంతమైన గేమ్‌ కాబట్టి, కీలకమైన క్షణాలు అంటే గెలుపు, ఓటమి మధ్య వ్యత్యాసాన్ని సూచించే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అందుకే ICC ఇటీవలే ఆట పరిస్థితులలో అనేక మార్పులను ప్రకటించింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. కొన్ని ఆస్ట్రేలియాలో చర్చనీయాంశంగా మారవచ్చని తెలుస్తోంది.

ICC బుధవారం తన వెబ్‌సైట్‌లో జట్లను హెచ్చరించింది. “పొట్టి ఫార్మాట్‌లో ఈ నూతన మార్పులు ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్‌లో మరింత నిర్ణయాత్మక క్షణాలు కావచ్చు” అంటూ పేర్కొంది.

జట్లు, సహాయక సిబ్బంది, ఆటగాళ్లు ఐదు ప్రధాన మార్పులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గ్లోబల్ క్రికెట్ గవర్నింగ్ బాడీ తెలిపింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

నాన్‌ స్ట్రైకర్‌ క్రీజులో ఉండాలి. లేకుంటే మాన్‌కాడింగ్‌ ప్రమాదం తప్పదు.

ఏ బౌలర్ లాలాజలాన్ని ఉపయోగించలేరు.

కొత్త బ్యాట్స్‌మన్ 90 సెకండ్లలోపు స్ట్రైక్‌ను తీసుకోవాలి.

బ్యాటర్ కొంత భాగాన్ని పిచ్‌లో ఉండేలా పరిమితం చేశారు. అయితే, బ్యాటర్‌ని పిచ్ నుంచి బయటకు వెళ్లేలా చేసే ఏదైనా బంతిని నో బాల్ లేదా డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు.

ఫీల్డర్ అనుచిత ప్రవర్తనతో 5 పరుగుల పెనాల్టీని పడుతుంది.