T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ 2022లో భారీ రికార్డుపై కన్నేసిన స్టార్ ప్లేయర్స్.. లిస్టులో రోహిత్, కోహ్లీ
2022 టీ20 ప్రపంచకప్‌లో ఓ భారీ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు 2 దేశాలకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు రేసులో ముందంజలో ఉన్నారు.
ప్రపంచకప్ టీ20 అయినా, వన్డే అయినా రికార్డులు ఎన్నో బద్దలవుతుంటాయి. మరికొన్ని కొత్తవి ఏర్పడుతుంటాయి. ఇటువంటి ట్రోర్నీలలో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు, తమ ఖాతాలో రికార్డుల పేజీలను లిఖించుకుంటుంటారు. ఇక ఆస్ట్రేలియాలో మరో వారంలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లోనూ రికార్డుల జాతర జరగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈసారి ఓ భారీ రికార్డుకు ముప్పు పొంచి ఉంది. అంటే, అది ఈ సారి బ్రే అయ్యే ఛాన్స్ ఉంది. ఈసారి 2 దేశాలకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఆ భారీ రికార్డును బద్దలు కొట్టే రేసులో ముందంజలో నిలిచారు.
ఇంతకీ ఆ రికార్డులు ఏంటని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు ఈసారి బద్దలు కానుంది. 2022 T20 ప్రపంచ కప్‌లో భారత్ లేదా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ దీన్ని బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
భారీ రికార్డును బ్రేక్ చేసే రేసులో ఎవరున్నారంటే..
T20 ప్రపంచ కప్ 2022లో ఈ పనిని చేయగల భారతదేశం నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుంచి ఒక బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఈ రికార్డుపై ముగ్గురి మధ్య విపరీతమైన పోటీ నెలకొని ఉంది. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే రికార్డు సృష్టించాడు. అతను T20 ప్రపంచ కప్‌లో ఆడిన 31 మ్యాచ్‌లలో 31 ఇన్నింగ్స్‌లలో 1016 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. జయవర్ధనే చివరిసారిగా 2014లో టీ20 ప్రపంచకప్ ఆడాడు. అంటే గత 8 ఏళ్లలో మరో 2 టీ20 ప్రపంచకప్‌లు ఆడారు. ఇంతలో క్రిస్ గేల్, తిలకరత్నే దిల్షాన్ లు దగ్గరకు వచ్చినా జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. టీ20 ప్రపంచకప్‌లో గేల్ 33 మ్యాచ్‌ల్లో 965 పరుగులు చేయగా, జయవర్ధనే 35 మ్యాచ్‌ల్లో 897 పరుగులు చేశాడు.
రోహిత్ 169 పరుగులు, విరాట్ 171 పరుగుల దూరంలో..
అయితే ఈసారి భారత్‌కు చెందిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ ముగ్గురూ ఈ ప్రయత్నంలో విజయం సాధించేలా కనిపిస్తున్నారు. రోహిత్, విరాట్ మధ్య దూరం కేవలం 2 పరుగులు మాత్రమే. ఇప్పటివరకు ఆడిన 33 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో రోహిత్ 847 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 21 మ్యాచ్‌ల్లో 845 పరుగులు చేశాడు. అంటే ఈ రికార్డుకు రోహిత్ 169 పరుగుల దూరంలో ఉండగా, విరాట్ 171 పరుగుల దూరంలో నిలిచాడు. జయవర్ధనే రికార్డును విరాట్ బద్దలుకొడితే, టీ20 ప్రపంచకప్‌లో అత్యల్ప మ్యాచ్‌ల్లో 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా రికార్డులకెక్కనున్నాడు.
డేవిడ్ వార్నర్ 254 పరుగుల దూరంలో..
రోహిత్-విరాట్‌ల మాదిరిగానే, టీ20 ప్రపంచకప్‌లో 30 మ్యాచ్‌లలో 762 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై కూడా దృష్టి ఉంది. అంటే, జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టాలంటే వార్నర్ T20 వరల్డ్ కప్ 2022లో 254 పరుగులను దాటాల్సి ఉంటుంది.