AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాటింగ్‌లో పవర్‌ఫుల్.. బౌలింగ్‌లో మాత్రం వీక్.. 12 ఏళ్ల ఇంగ్లండ్ కరవు తీరేనా.. బలహీనతల నుంచి షెడ్యూల్ వరకు..

T20 World Cup 2022 England Cricket Team: రెండోసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు బలమైన జట్టుతో సిద్ధమైంది. 2010లో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్.. మరోసారి ట్రోఫీ ఎత్తాలని ఆశపడుతోంది.

బ్యాటింగ్‌లో పవర్‌ఫుల్.. బౌలింగ్‌లో మాత్రం వీక్.. 12 ఏళ్ల ఇంగ్లండ్ కరవు తీరేనా.. బలహీనతల నుంచి షెడ్యూల్ వరకు..
England Cricket Team
Venkata Chari
|

Updated on: Oct 11, 2022 | 4:08 PM

Share

క్రికెట్‌లోని పొట్టి ఫార్మాట్ అంటే T20 ప్రపంచ కప్ సమరానికి అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న అతిపెద్ద టోర్నమెంట్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ప్రతీ జట్టు ట్రోఫీని అందుకోవడానికి తన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసే క్రమంలో ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని జట్లు తన స్క్వాడ్‌లో బలమైన ఆటగాళ్లతో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఙంగ్లండ్ టీం గురించి మాట్లాడుకుంటే, జోస్ బట్లర్ సారథ్యంలో ఈ జట్టు.. ఈసారి ట్రోఫీని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. టీ20లో కాకుండా వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వన్డే కంటే ముందు 2010లో టీ20లో ఇంగ్లండ్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి రెండవ టైటిల్‌ను గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.

ఇంగ్లండ్‌ టీ20 ప్రపంచకప్‌ గెలిచి చాలా కాలం అవుతోంది. ఈసారి బట్లర్‌ తన కెప్టెన్సీలో జట్టుకు రెండో టైటిల్‌ను అందజేయాలని తహతహలాడుతున్నాడు. బట్లర్ టీమ్‌కు ట్రోఫీ అందుకునే పూర్తి సామర్థ్యం ఉంది. ప్రతి రంగంలోనూ గెలిచే సత్తా ఉంది. పరిమిత ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా పరిగణిస్తుంటారు.

బ్యాటింగ్‌లో పవర్ ఫుల్..

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌కు అతిపెద్ద బలం బ్యాటింగ్‌. ఈ జట్టులో ఒక ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌తో పాటు తుఫాను బ్యాటింగ్‌కు పేరుగాంచిన బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. ఈ జట్టు కెప్టెన్ ఎంత పదునైన బ్యాట్స్‌మెన్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బరిలోకి దిగితే బౌలర్ల తలరాతలు మారిపోతాయి. ఆయన తర్వాత ఫిల్ సాల్ట్ ఇటీవల పాకిస్తాన్‌పై అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో, అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి పేర్లు బౌలర్లను భయపెడుతుంటాయి. వీరు టీ20లో భీకర బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందారు.

ఆల్ రౌండర్లకు కొరతే లేదు..

వీరితోపాటు జట్టులో అద్భుతమైన ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో అద్భుతాలు చేయగలరు. వారిలో ప్రముఖంగా వినిపించే పేరు బెన్ స్టోక్స్. అతని తర్వాత మొయిన్ అలీ, సామ్ కరణ్ ఉన్నారు. బ్యాటింగ్‌లో చాలా డెప్త్ ఉంది. ఓపెనర్స్ త్వరగా పెవిలియన్ చేరినా.. ఈ జట్టు భారీ స్కోర్ చేయగలదు. లక్ష్యాన్ని సాధించగలదు.

బౌలింగ్‌లో తగ్గిన సత్తా..

ఇంగ్లండ్ టీమ్ కంప్లీట్ ప్యాక్‌తో సిద్ధమైంది. అయితే, ఈ టీమ్ బౌలింగ్‌లో కాస్త జోరుతగ్గినట్లు కనిపిస్తోంది. క్రిస్ జోర్డాన్ టీ20లో అంత ప్రభావవంతంగా రాణించలేకపోతున్నాడు. రీస్ టాప్లీ ఇప్పటి వరకు 20 టీ20 మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ కాకుండా జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, డేవిడ్ విల్లీ ఈ ఫార్మాట్‌లో తమను తాము నిరూపించుకున్నారు.

2010లో తొలి ట్రోఫీ..

ఇంగ్లండ్ జట్టు పాల్ కాలింగ్‌వుడ్ కెప్టెన్సీలో 2010లో మొదటి T20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఆ జట్టుకు రెండో టైటిల్‌ రాలేదు. ఇప్పటివరకు ఈ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇదే. దీని తర్వాత ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో 2016లో ఇంగ్లండ్ ఫైనల్ ఆడింది. కానీ, వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఈసారి 2010 విజయాన్ని పునరావృతం చేసేందుకు జట్టు ప్రయత్నిస్తుంది.

ఇంగ్లండ్ షెడ్యూల్..

22 అక్టోబర్ ఇంగ్లండ్ v ఆఫ్ఘనిస్తాన్, పెర్త్ స్టేడియం, పెర్త్

26 అక్టోబర్ vs ఇంగ్లాండ్ (క్వాలిఫైయర్ జట్టు), MCG, మెల్బోర్న్

28 అక్టోబర్ ఇంగ్లాండ్ v ఆస్ట్రేలియా, MCG, మెల్బోర్న్

01 నవంబర్ ఇంగ్లాండ్ v న్యూజిలాండ్, గబ్బా, బ్రిస్బేన్

05 నవంబర్ ఇంగ్లాండ్ v (క్వాలిఫైయర్ జట్టు), SCG, సిడ్నీ

ఇంగ్లండ్ జట్టు..

జోస్ బట్లర్ (సారథి), మోయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, జానీ బెయిర్‌స్టో.