పండుగ సీజన్‌ అని పిండి వంటలు తెగ చేస్తున్నారా.. అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ఇబ్బందులే..

తెలుగు రాష్ట్రాల్లో కల్తీ ఆయిల్ భాగోతం మరోసారి తెరపైకి వచ్చింది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రలో నకిలీ ఆయిల్‌ను సృష్టించి ప్రజలను అడ్డంగా దోచేస్తున్నారు కేటుగాళ్లు. కరీంనగర్ జిల్లాలో వంటనూనె ప్యాక్టరీపై.. ఎన్టీఆర్ జిల్లాలో కల్తీ క్యాస్ట్రాల్ షాపులపై అధికారులు దాడులు చేశారు.

పండుగ సీజన్‌ అని పిండి వంటలు తెగ చేస్తున్నారా.. అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ఇబ్బందులే..
Heat Oil
Follow us
Venkata Chari

|

Updated on: Oct 12, 2022 | 7:43 PM

దసరా,దీపావళి వరుస పండుగలను క్యాస్ చేసుకుని.. ప్రజలను భారీగా మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు వ్యాపారులు. అనుమతులు, లేబుల్ లేని వంట నూనెలను తయారి చేసి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి శివారులో లేబుల్ లేకుండా వంట నూనె తయారు చేస్తున్న విష్ణు ఇండస్ట్రీస్ పై ఫుడ్ సేప్టీ అధికారులు రైడ్ చేశారు. లేబుల్ లేకుండా ట్రాన్స్‌ఫోర్ట్ చేస్తున్న 2500 లీటర్ల వంట నూనె బాక్స్ లను సీజ్ చేశారు. నూనె తయారీలో సేప్టీ పాటించడం లేదని గుర్తించారు. ల్యాబ్ కు శాంపిల్స్ పంపారు. రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు అధికారులు.

మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కల్తీ ఆయిల్ మాఫియా పెట్రేగిపోతుంది. ప్రముఖ ఆయిల్ సంస్థ క్యాస్ట్రాల్ పేరుతో నకిలీ ఆయిల్ ను సృష్టించి వాహనదారులను అడ్డంగా దోచేస్తున్నారు అక్రమార్కులు. బహిరంగ షాపుల్లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు కేటుగాళ్లు. ఎట్టకేలకు కల్తీ క్యాస్ట్రాల్ ఆయిల్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.

ఇవి కూడా చదవండి

షాపుల్లో బహిరంగంగా అమ్మకాలు సాగిస్తున్న 250లీటర్ల నకిలీ క్యాస్ట్రాల్ ఆయిల్ ను సీజ్ చేశారు పోలీసులు. నకిలీ ఆయిల్ పునాధులు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టే పనిలో ముమ్మర విచారణ చేస్తున్నారు. నకిలీ ఆయిల్ ను అమ్ముతున్న షాపు యాజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.