Andhra Pradesh: ఏపీఎస్‌ఆర్టీసీకి కలిసొచ్చిన దసరా.. రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతంటే?

ముందస్తు ప్రణాళిక తో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. దసరా పండగ వేళల్లో అత్యధికంగా 4,626 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Andhra Pradesh: ఏపీఎస్‌ఆర్టీసీకి కలిసొచ్చిన దసరా.. రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతంటే?
Apsrtc
Follow us

|

Updated on: Oct 12, 2022 | 8:14 PM

ఏపీఎస్‌ఆర్టీసీకి దసరా పండగ బాగా కలిసొచ్చింది. ఈ పర్వదినాల్లో రికార్డు ఆదాయం ఆర్జించింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 10 వ తేదీ వరకు మొత్తం271 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. కాగా కొవిడ్ తర్వాత ప్రయాణికులు ఈ దసరాకు అధిక సంఖ్యలో సొంత ఊళ్లకు వచ్చారు. ఈనేపథ్యంలో ముందస్తు ప్రణాళిక తో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. దసరా పండగ వేళల్లో అత్యధికంగా 4,626 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని సాధారణ ఛార్జీలతో నడిపి 11.50 కోట్లు ఆదాయం ఆర్జించింది. గత సంవత్సరం 2, 437 బస్సులతో 5.49 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక పండగ తర్వాత తిరుగు ప్రయాణానికి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. కాగా ఈనెల10వ తేదీ ఒక్క రోజునే ఆర్టీసీకి 22 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

కాగా ఈ నెల 9వ తేదీ గిరి ప్రదక్షిణం, దర్శనం కొరకు తిరువన్నామలై (అరుణాచలం) కు కడప, నెల్లూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నరసరావుపేట నుండి11 బస్సులు నడిపినట్లు పేర్కొన్నారు. ఈ బస్సుల నుంచి 5.60 లక్షల అదనపు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కాగా ప్రయోగాత్మకంగా ఒక బస్సుతో ప్రారంభించి మొదటి నెలలోనే 11 బస్సులు నడిపామని, ఇకపై ప్రతినెలా పౌర్ణమి కి అరుణాచలం/ తిరువన్నామలై కి బస్సులు ఏర్పాటుచేస్తామన్నారు. డిమాండు ని బట్టి ఇతర ప్రదేశముల నుండి కూడా తిరువన్నామలై కు బస్సులను అందబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే కార్తీక మాసం, శబరిమల పుణ్యక్షేత్ర దర్శనాలకు కూడా పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..