Cricket: 3 మ్యాచ్‌ల తర్వాత టీమిండియా నుంచి ఔట్.. కట్ చేస్తే.. 9 ఫోర్లు, 7 సిక్సులతో తుఫాన్ సెంచరీ..

గత ఏడాది నితీష్ రానా ఒక ODI, 2 T20 మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ఆ తర్వాత నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం సయ్యద్ మస్తాక్ అలీ..

Cricket: 3 మ్యాచ్‌ల తర్వాత టీమిండియా నుంచి ఔట్.. కట్ చేస్తే.. 9 ఫోర్లు, 7 సిక్సులతో తుఫాన్ సెంచరీ..
Syed Mushtaq Ali 2022 Nithish Rana
Follow us
Venkata Chari

|

Updated on: Oct 12, 2022 | 8:24 PM

టీమ్ ఇండియాకు తిరిగి రావాలని ఎదురుచూస్తున్న తుఫాను బ్యాట్స్‌మెన్ నితీష్ రాణా బుధవారం బీభత్సం సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022లో కేవలం 55 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఢిల్లీ తరపున ఎలైట్ గ్రూప్ B మ్యాచ్‌లో, అతను పంజాబ్‌పై 61 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్‌లతో 107 పరుగులు చేశాడు. నితీష్ టీమ్ ఇండియాకు తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాడు. అతను కేవలం 3 మ్యాచ్‌ల తర్వాత టీమ్ ఇండియా నుంచి తొలగించారు.

నితీష్ గత ఏడాది ఒక వన్డే, 2 T20 మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కానీ, అప్పటి నుంచి అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఢిల్లీ ఒక్కసారిగా కేవలం 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

రానా ధాటికి 183 పరుగులకు చేరిన ఢిల్లీ..

ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోవడంతో.. కెప్టెన్ నితీష్ రాణా సంచలనం సృష్టించి స్కోరును 183 పరుగులకు చేర్చాడు. కెప్టెన్ రానాను పెవిలియన్ చేర్చి సిద్ధార్థ్ కౌల్ ఢిల్లీకి మూడో దెబ్బ కొట్టాడు. దీని తర్వాత యశ్ ధుల్ ఇన్నింగ్స్‌తో 191 పరుగులకు చేరుకుంది. ధుల్ 45 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేశాడు.

అమిత్ మిశ్రా ఖాతాలో 3 వికెట్లు..

అదే సమయంలో టోర్నీలోని మరో మ్యాచ్‌లో ఐపీఎల్‌ టీంలు పట్టించుకోని అమిత్ మిశ్రా బంతితో విధ్వంసం సృష్టించి 83 పరుగుల తేడాతో జట్టును గెలిపించాడు. మిశ్రా 10 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హర్యానా బ్యాట్స్‌మెన్ ఘోర పరాజయం పాలయ్యారు. రాహుల్ తెవాటియా 19 బంతుల్లో అత్యధికంగా 35 పరుగులు చేశాడు. మేఘాలయకు చెందిన రాజేష్ బిష్ణోయ్ 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

లక్ష్య ఛేదనకు దిగిన మేఘాలయ జట్టు మిశ్రా విధ్వంసం ముందు నిలబడలేక 53 పరుగులకే కుప్పకూలింది. మేఘాలయకు చెందిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేకపోయారు. అమిత్ మిశ్రా చాలా కాలం పాటు ఢిల్లీలో భాగంగా ఉన్నాడు. కానీ, IPL 2022 వేలంలో ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు.