T20 World Cup 2022: వీసా ఇబ్బందుల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా వెళ్లడంలో సమస్యలు..

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ కూడా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. కానీ, వెళ్లలేకపోయారు.

T20 World Cup 2022: వీసా ఇబ్బందుల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా వెళ్లడంలో సమస్యలు..
Icc T20 World Cup 2022 Team India
Follow us
Venkata Chari

|

Updated on: Oct 12, 2022 | 8:30 PM

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ 2022కు భారత్ సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అంతకుముందు వార్మప్ మ్యాచ్‌లో జట్టు తన సన్నాహాలను పరీక్షిస్తోంది. అయితే భారత్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఇంకా ఆస్ట్రేలియా చేరుకోలేదు. వీసా కారణంగా, ఇద్దరు బౌలర్లు ఆస్ట్రేలియా చేరుకోవడంలో ఆలస్యం అవుతోంది. ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ ఇద్దరూ T20 ప్రపంచ కప్‌నకు నెట్ బౌలర్‌లుగా ఎంపికయ్యారు.

వీసా సమస్యల కారణంగా ఉమ్రాన్, కుల్దీప్ ఇద్దరూ ఆస్ట్రేలియాకు వెళ్లే విమానంలో ఆలస్యం అయ్యారు. ఉమ్రాన్ ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ తరపున ఆడుతున్నాడు. అతను మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లకు వ్యతిరేకంగా అడుగుపెట్టాడు.

జట్టులో చేరేందుకు ఉమ్రాన్‌కు అనుమతి..

జమ్మూ కాశ్మీర్ జట్టులో చేరేందుకు ఉమ్రాన్ మాలిక్‌కు బీసీసీఐ నుంచి మినహాయింపు లభించింది. అయితే, అతను ఇప్పుడు ఆస్ట్రేలియాకు ఎప్పుడు వెళ్తాడు అనే దాని గురించి ఎటువంటి అప్‌డేట్ లేదు. ఉమ్రాన్‌తో పాటు, కుల్దీప్ కూడా ఈ కారణంగా ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌తో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్‌పై కూడా అడుగుపెట్టాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో విధ్వంసం..

ఉమ్రాన్ ఐపీఎల్‌లో వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో 157 కి.మీ వేగంతో బాల్ బౌలింగ్ చేసిన ఏకైక భారత ఆటగాడిగా నిలిచాడు. మీడియా నివేదికల ప్రకారం, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్ ముగ్గురూ అక్టోబర్ 6న భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది.

రిజర్వ్‌ ఆటగాళ్లతో కలిసి ప్రయాణం..

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు మహ్మద్ సిరాజ్ ఎంపికయ్యాడు. వీసా కారణంగా ఉమ్రాన్, కుల్దీప్ వెళ్లలేకపోయారు. ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లు రిజర్వ్ ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చని భావిస్తున్నారు.

ఉమ్రాన్ బౌలింగ్‌కు బ్రెట్ లీ ఫిదా..

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌కు అభిమానిగా మారాడు. ఉమ్రాన్ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ కారుని కలిగి ఉన్నప్పుడు, దానిని గ్యారేజీలో ఉంచితే ప్రయోజనం ఏమిటి? టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టులో ఉమ్రాన్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని లీ అభిప్రాయపడ్డాడు.