AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా.. రఫ్పాడిస్తోన్న చిన్నారి.. షాట్ కొడితే బాల్ బౌండరీ దాటాల్సిందే..

నేను చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. రెండు పరుగుల కోసం పరిగెత్తినప్పుడు త్వరగా అలసిపోతాం. ఆపై ఒక పరుగు కోసం పరిగెత్తాలని అనిపించదు. అందుకే హెలీకాప్టర్ షాట్..

Watch Video: విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా.. రఫ్పాడిస్తోన్న చిన్నారి.. షాట్ కొడితే బాల్ బౌండరీ దాటాల్సిందే..
Girl Crciket Viral Video
Venkata Chari
|

Updated on: Oct 15, 2022 | 6:49 PM

Share

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఇక ఆటలకు సంబంధించిన వీడియోలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ వీడియోకు విరాట్ కోహ్లీకి కూడా ఓ కనెక్షన్ కూడా ఉంది. లడఖ్‌కు చెందిన ఓ యువతి బ్యాటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అమ్మాయి తనను తాను విరాట్ కోహ్లీ అభిమానిగా చెప్పుకుంటుంది. తాను కోహ్లీలా ఉండాలని కోరుకుంటుందని చెబుతోంది. ఆరో తరగతి చదువుతున్న మక్షుమా బ్యాటింగ్‌ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను లడఖ్‌లోని విద్యాశాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

” ఇంట్లో మా నాన్న, స్కూల్‌లో మా టీచర్లు క్రికెట్ ఆడేందుకు నన్ను ప్రోత్సహిస్తున్నారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను ” అంటూ బాలిక చెప్పడం వీడియోలో చూడొచ్చు. మక్షుమా మాట్లాడుతూ, నాకు షాట్‌ల కొరత లేదు. అయితే, హెలికాప్టర్ షాట్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. రెండు పరుగుల కోసం పరిగెత్తినప్పుడు త్వరగా అలసిపోతాం. ఆపై ఒక పరుగు కోసం పరిగెత్తాలని అనిపించదు. అందుకే హెలీకాప్టర్ షాట్ ఆడాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. నా అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ, అందుకే నేను ఆయనిలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో కింగ్ కోహ్లి..

భారత మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం 2022 T20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు. క్రికెట్ మహా సంగ్రామానికి ముందు కోహ్లీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో జరగనుంది.