ODI Cricket: పొట్టి ఫార్మాట్ రాకతో ప్రమాదంలో వన్డే క్రికెట్.. మార్పులు చేస్తే భవిష్యత్ ఉండేనా?
50 Over Format: ప్రపంచవ్యాప్తంగా T20I మ్యాచ్‌లు, లీగ్‌ల ప్రజాదరణ పెరగడంతో పూర్తి స్థాయి క్రికెట్ మజా అందించే 50 ఓవర్ల క్రికెట్ భవిష్యత్తును తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఈ మధ్య వన్డే క్రికెట్ భవిష్యత్తు గురించి చర్చలు ఎక్కువ అయ్యాయి. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. ఈ జూలైలో 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి బెన్ స్టోక్స్ రిటైర్మెంట్‌తో మరోసారి ఈ ఫార్మాట్‌పై ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ఫార్మాట్ ఒకప్పుడు అభిమానులకు ఎంతో ఆనందాన్ని అందించింది. అయితే, కాలక్రమేణ ఈ ఫార్మాట్ తన ప్రాభావాన్ని కోల్పోతోంది. వన్డే క్రికెట్ తన మెరుపును కోల్పోవడం యాదృచ్చికం మాత్రం కాదు. టెస్ట్ ఫార్మాట్ అనేది క్రికెట్ తొలి ఫార్మాట్. అయితే, ఈ మధ్య వచ్చిన పొట్టి ఫార్మాట్ సహస్రాబ్దాలుగా అందించే థ్రిల్, వినోదాన్ని తన వెంట తీసుకపోయింది.
దశాబ్దాల క్రితం, 50-ఓవర్ల ఫార్మాట్ ఆవిర్భావం ఆట పొడవైన ఫార్మాట్‌పై ఆసక్తిని తగ్గించడానికి దారితీసింది. ప్రస్తుతం T20 క్రికెట్ ODI క్రికెట్‌కు మరణ శాసనం రాస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా T20I మ్యాచ్‌లు, లీగ్‌ల ప్రజాదరణ పెరుగుదలతో.. 50 ఓవర్ల క్రికెట్ భవిష్యత్తును తీవ్రమైన ప్రమాదంలో పడేస్తుంది.
అయితే, ఎన్నో అద్భుతమైన క్షణాలను అందించిన 50-ఓవర్ల ఫార్మాట్, గేమ్‌లోని పొడవైన, పొట్టి ఫార్మాట్‌ల మధ్య కీలకమైన వారధిగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.
ఈ సంవత్సరం ప్రారంభంలో స్టోక్స్ ఊహించని విధంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 50-ఓవర్ల ఆటను ఎలా ఉత్సాహంగా మార్చాలనే దానిపై చాలా మంది ఆటగాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా వన్డే క్రికెట్‌ను ఆసక్తికరంగా మార్చేందుకు సూచనలు అందించిన తాజా క్రికెటర్‌గా నిలిచాడు.
జంపా సహచరుడు అష్టన్ అగర్ 50 ఓవర్ల క్రికెట్‌లో ఎలాంటి మార్పులను కోరుకోనప్పటికీ.. “నేను ODI క్రికెట్‌ని ఇష్టపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
“మీకు తెలుసా, 10 ఓవర్లు (ఒక్కో బౌలర్‌కు) ఒక అందమైన బౌలింగ్ సమయం. యాభై ఓవర్లు బ్యాటింగ్ చేయడానికి మంచి సమయం. అయితే, ప్రజలు నిరుత్సాహానికి గురవుతారని నేను అనుకుంటున్నాను. బహుశా ఇది కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇది కేవలం T20 క్రికెట్ రాక కారణంగానే అని నేను అనుకుంటున్నాను. నాకు ODI క్రికెట్ అంటే ఇష్టం.” అంటూ తెలిపాడు.
వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అలెక్స్ కారీ కూడా సవరణలకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.”వన్-డే క్రికెట్‌కు ఖచ్చితంగా ఆటలో చాలా స్థలం ఉంది”. వికెట్ కీపర్ కం బ్యాటర్.. 50 ఓవర్ల ప్రపంచ కప్ 2019ని ఉదాహరణను పేర్కొన్నాడు.”
ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ రెండు కొత్త బంతుల నిబంధనకు ముగింపు పలకాలని సూచించాడు. “ఒక ఎండ్ నుంచి ఒక బాల్, లేదా రెండు ఎండ్‌లు.. బ్యాటర్‌లకు అనుకూలంగా కొత్త బంతిని ఇవ్వడం ఆపాలంటూ కోరుకుంటున్నాడు. “రివర్స్ స్వింగ్‌ను తిరిగి తీసుకురావాలి, స్పిన్‌ను తిరిగి తీసుకురావాలి” అని లియాన్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే, ఉస్మాన్ ఖవాజా, ఆరోన్ ఫించ్ వన్డేలను ఆసక్తికరంగా మార్చడానికి ఓవర్లను తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు.
“నేను 40 ఓవర్లు ఉంటే వన్డే క్రికెట్‌ను మరింత ఇష్టపడతానని, కొన్ని సంవత్సరాల క్రితం 40 ఓవర్ల క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను ఇంగ్లండ్‌లో ప్రో40 ఆడాను. నేను దానిని చాలా ఆనందించాను.” అంటూ చెప్పుకొచ్చాడు.
“50 ఓవర్లు ఇప్పుడు కొంచెం ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. T20 క్రికెట్ అద్భుతం. టెస్ట్ క్రికెట్ పరాకాష్ట. నేను వన్డే క్రికెట్‌ను 40 ఓవర్లు చేస్తే, మంచిదని భావిస్తున్నాను.” అంటూ ఈ ప్లేయర్ చెప్పుకొచ్చాడు.
ఇటీవలే వన్డే క్రికెట్ నుంచి రిటైరైన ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఫించ్ కూడా ఖవాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
“కొన్ని సంవత్సరాలకు ఇదే చర్చ వస్తూనే ఉంది. ప్రపంచ కప్‌నకు 12 నెలల దూరంలో ఉన్నప్పుడు, ప్రజలు మాట్లాడుతుంటారు. కానీ, వన్డే ఫార్మాట్ లో మార్పులు త్వరలోనే చూస్తాం అనుకుంటున్నాను ” అని ఫించ్ తెలిపాడు.