Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: కొత్త బీసీసీఐ అధ్యక్షుడిగా అతడే ‘సరైనోడు’.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ పదవీ కాలం పూర్తవ్వడంతో.. కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ పదవి కోసం భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ నామినేషన్..

BCCI: కొత్త బీసీసీఐ అధ్యక్షుడిగా అతడే 'సరైనోడు'.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
Roger Binny And Ravi Shastr
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 14, 2022 | 8:24 AM

భారత క్రికెట్ నియంత్రణ మండలి- బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మాజీ టీమిండియా ప్లేయర్ రోజర్ బిన్నీ దాదాపు బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ పదవీ కాలం పూర్తవ్వడంతో.. కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ పదవి కోసం భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ ఎంపిక దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనను రవిశాస్త్రి స్వాగతించారు. 1983లో భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచిన టీమ్ లో రోజర్ బిన్ని తన సహచరుడని అతడికి బీసీసీఐ అధ్యక్ష పదవి వరిస్తే తాను సంతోషిస్తానని చెప్పాడు. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ ఆయన కొనసాగుతున్నారని, ఆ అనుభవం కూడా ఈ పదవికి ఆయన ఎన్నికవ్వడానికి ఒక అర్హతగా పేర్కొన్నాడు.

తొలిసారి ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిని అయినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని రవి శాస్త్రి ఇటీవల ఓ స్పోర్ట్స్ ఛానల్ లో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. మరోవైపు బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న సౌరవ్ గంగూలీ బోర్డులో మరో పదవి ఏదైనా నిర్వహిస్తారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. బీసీసీఐ ఛైర్మన్ గా కొనసాగాలని సౌరవ్ గంగూలీ ఆసక్తిగా ఉన్నారని, అయితే ఇతర సభ్యుల నుంచి తనకు కావలసిన మద్దతు లభించలేదన్న ప్రచారం జరగుతుండటంపై రవిశాస్త్రి స్పందిస్తూ జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలిపారు. తనకు తెలిసినంతవరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి రెండోసారి ఉండవచ్చని అనుకోవడం లేదని, అయితే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదన్నారు. ఏది ఏమైనప్పటికి ఒకే వ్యక్తి రెండోసారి ఆ పదవిని చేపట్టకపోవడం వలన మరో క్రికెటర్ కు అవకాశం కల్పిస్తుందని వ్యాఖ్యానించారు రవిశాస్త్రి. ప్రస్తుతం ఓ వ్యక్తి ఏదైనా చేస్తున్నాడంటే శాశ్వతంగా అదే పని ఆ వ్యక్తి చేస్తారని కాదు.. కొన్ని పదవులకు కొత్త వాళ్లు వస్తుంటారు ఇది ఒక రకంగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తు్ందని రవిశాస్త్రి తెలిపారు.

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కు సారథ్యం వహించిన రోజర్ బిన్నీకి బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అవసరమైన అర్హతలు ఉన్నాయని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచ కప్ సాధించిన భారత క్రికెట్ జట్టులో బిన్నీ సభ్యుడు, అతడి క్రికెట్ కెరియర్ కూడా బాగానే ఉంది. బీసీసీఐ అధ్యక్షుడి పదవికి అతడు సరైన వ్యక్తేనని తెలిపారు. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత దేశవాలీ క్రికెట్ అభివృద్ధిపై శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.  బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలో మెరుగుపడాల్సిన విషయాల గురించి మాట్లాడుతూ.. క్రికెట్ మైదానాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. స్టేడియంలో సౌకర్యాలు కల్పించడం అనేది అతి ముఖ్యమైన విషయమని రవిశాస్త్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..