AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: దాయాది జట్టుపై విమర్శలు.. ధోనిపై ప్రశంసలు కురిపించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్..

బంగ్లాదేశ్ తో జరిగిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచిన పాకిస్తాన్, న్యూజిలాండ్ తో అక్టోబర్ 11వ తేదీన జరిగిన మ్యాచ్ లో దాయాది జట్టు ఓటమిపాలైంది. తక్కువ స్కోర్ కొట్టడంతో పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో గెలవలేకపోయింది. దీంతో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని..

MS Dhoni: దాయాది జట్టుపై విమర్శలు.. ధోనిపై ప్రశంసలు కురిపించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్..
Ms Dhoni
Amarnadh Daneti
|

Updated on: Oct 14, 2022 | 12:45 PM

Share

టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది. అన్ని జట్లు ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ లోపు భారత్ తో సహా అనేక దేశాలు టీ20 సిరీస్ లు ఆడాయి. ప్రస్తుతం పాకిస్తాన్- న్యూజిలాండ్- బంగ్లాదేశ్ టీ20 ట్రై సిరీస్ లో తలపడుతున్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచిన పాకిస్తాన్, న్యూజిలాండ్ తో అక్టోబర్ 11వ తేదీన జరిగిన మ్యాచ్ లో దాయాది జట్టు ఓటమి పాలైంది. తక్కువ స్కోర్ కొట్టడంతో పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో గెలవ లేకపోయింది. దీంతో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉదాహరణను ఉటంకిస్తూ పాకిస్తాన్ జట్టును విమర్శించాడు ఆ దేశ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్. జట్టు మిడిల్ ఆర్డర్ బాగోలేదంటూ చెప్పాడు. ఇదే సమయంలో మిడిలార్డర్ లో ఇఫ్తికార్ అహ్మద్ గురించి మాట్లాడుతూ.. అతడు ఎంఎస్ ధోనీ లాగా ఆడతాడు కానీ ముగింపు మాత్రం ధోనిలా ఇవ్వలేక పోతున్నాడన్నారు. పాకిస్తాన్ జట్టు ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లపై ఎక్కువగా ఆధారపడుతోందని వారు విఫలమైతే జట్టు గెలవలేక పోతుందన్నారు.

అక్టోబర్ 11వ తేదీ మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయిన మ్యాచ్‌లోనూ ఇదే ధోరణి కనిపించిందన్నారు. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ తక్కువ స్కోర్‌కే అవుట్ అయిపోవడంతో పాకిస్థాన్ ఆమ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. షాన్ మసూద్14, షాదాబ్ ఖాన్ 8, ఇఫ్తికర్ అహ్మద్ 27, హైదర్ అలీ 8 పరుగులు మాత్రమే చేయలేకపోయారు. దీంతో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఆ దేశ జట్టు మిడిల్ ఆర్డర్‌ పై విమర్శలు గుప్పించాడు. అయితే 27 పరుగుల స్కోర్ చేసిన ఇఫ్తికర్ అహ్మద్ గురించి మాట్లాడుతూ.. అతడు తన ఇన్నింగ్స్‌ను MS ధోని లాగా ప్రారంభించాడని, జట్టులోని అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకడని అంటూనే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని లాగా ముగింపు ఇవ్వలేకపోయాడని అన్నారు.

ధోని చివరిలో సింగిల్స్ తో పాటు సిక్స్‌లు కొట్టేవాడని. ఈ మ్యాచ్ లో ఇఫ్తికర్ అహ్మద్ పది డాట్ బాల్స్ ఆడాడని గుర్తు చేశాడు. డాట్ బాల్స్ ఆడిన తర్వాత పెద్ద షాట్లు కొట్టడానికి ప్రతయ్నిస్తే ఆ బ్యాట్స్ మెన్ అవుట్ అవుతారని, అందుకే ఎక్కువ బాల్స్ డాట్ ఆడకుండా సింగిల్స్ తో పాటు భారీ షాట్ లు ఆడటం ద్వారా జట్టు స్కోర్ పెరుగుతుందని చెప్పాడు ఈ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ .

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో