AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Asia Cup: ఆ పరుగులు ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.. ఆసియా కప్ పై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ ఏమన్నారంటే..

మహిళల ఆసియా కప్ భారత్ తో పాటు శ్రీలంక మహిళల జట్టు ఫైనల్స్ చేరాయి. అక్టోబర్ 15వ తేదీన ఈరెండు జట్లు ఫైనల్స్ మ్యాచ్ లో తలపడనున్నాయి. అక్టోబర్ 13వ తేదీ గురువారం జరిగిన సెమీఫైనల్ మ్మాచ్ లో థాయ్ లాండ్ పై..

Women's Asia Cup: ఆ పరుగులు ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.. ఆసియా కప్ పై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ ఏమన్నారంటే..
Harmanpreet Kaur
Amarnadh Daneti
|

Updated on: Oct 14, 2022 | 9:55 AM

Share

మహిళల ఆసియా కప్ భారత్ తో పాటు శ్రీలంక మహిళల జట్టు ఫైనల్స్ చేరాయి. అక్టోబర్ 15వ తేదీన ఈరెండు జట్లు ఫైనల్స్ మ్యాచ్ లో తలపడనున్నాయి. అక్టోబర్ 13వ తేదీ గురువారం జరిగిన సెమీఫైనల్ మ్మాచ్ లో థాయ్ లాండ్ పై హర్మన్‌ ప్రీత్ కౌర్ సేన విజయం సాధించి ఫైనల్స్ కు ప్రవేశించింది. గాయం కారణంగా కౌర్ ఆసియాకప్ లో చివరి రెండు లీగ్ మ్యాచ్ లను ఆడలేకపోయింది. అయితే గురువారం థాయ్ లాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవన్ లో చోటు సంపాదించడంతో పాటు జట్టుకు నాయకత్వం వహించింది. స్వల్ప గాయాలతో విశ్రాంతి తీసుకుని జట్టుకు తిరిగి వచ్చిన తర్వాత మహిళల ఆసియా కప్ సెమీఫైనల్‌లో థాయ్‌లాండ్‌పై తాను చేసిన 36 పరుగులు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని హర్మన్‌ ప్రీత్ కౌర్ అన్నారు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో హర్మన్‌ ప్రీత్ కౌర్ నాలుగు బౌండరీల సహాయంతో 30 బంతుల్లో 36 పరుగులు చేసింది. దీంతో భారత్ 148 పరుగుల స్కోర్ ను నిర్ణీత 20 ఓవర్లలో చేయగలిగింది.

థాయ్ లాండ్ పై విజయం సాధించిన తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. తాను తన ఆటపై మరింత విశ్వాసంతో ఉన్నానని తెలిపింది. జట్టు విజయానికి అవసరమైట్లు ఆడటానికి తాను ఎప్పుడూ సిద్ధంగానూ, సంతోషంగానూ ఉంటానని తెలిపింది. మహిళల ఆసియా కప్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో థాయ్‌లాండ్‌పై విజయం సాధించడంతో వరుసగా భారత్‌ ఎనిమిదోసారి ఆసియా కప్ ఫైనల్‌కు వెళ్లింది. ఇదే సమయంలో థాయ్ లాండ్ తో జరిగిన మ్యాచ్ పై స్పందిస్తూ.. తాము బాగా బ్యాటింగ్ చేసామని అయితే థాయ్ లాండ్ చాలా బాగా బౌలింగ్ చేసిందన్నారు. తమకు సులభంగా పరుగులు ఇవ్వలేదని, రన్స్ కోసం కష్టపడాల్సి వచ్చిందని కౌర్ తెలిపారు.

బౌలింగ్ లోనూ దీప్తి శర్మ బాగా ఆకట్టుకుందన్నారు. దీప్తి శర్మ ఏ దశలోనైనా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటుందని, అలాంటి బౌలర్‌ జట్టులో ఉండటం ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పారు. ఫైనల్స్ లో జట్టు సమిష్టిగా ఆడి విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..