Sourav Ganguly: ఎట్టకేలకు మౌనం వీడిన గంగూలీ.. అందుకోసమే పోటీకి దూరం అంటూ కామెంట్స్..
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలం అక్టోబర్ 18తో ముగియనుంది. దీంతో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బన్నీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుమగమైంది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ప్రయాణం ముగియనుంది. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా తాను రెండో ఇన్నింగ్స్‌లో ఉండలేనని సౌరవ్ గంగూలీ అంగీకరించాడు. ప్రస్తుతం మరో పెద్ద టాస్క్‌పై దృష్టి సారిస్తానని టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ క్లారీటి ఇచ్చాడు. దీంతో మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఎలాంటి వ్యతిరేకత లేకుండానే బీసీసీఐ కొత్త అధ్యక్షుడయ్యే అవకాశం నెలకొంది.
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిపై వస్తున్న ఊహాగానాలపై సౌరవ్ గంగూలీ స్వయంగా మౌనం వీడారు. అడ్మినిస్ట్రేటర్‌గా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడానని, ఇప్పుడు తన దృష్టి వేరే పనిపైనే ఉందని సౌరవ్ గంగూలీ తెలిపాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ.. నేను చాలా కాలం పాటు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నాను. కానీ, ఇప్పుడు నేను నా జీవితంలో మరింత ముందుకు సాగే ఉద్దేశంలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.
తాను 15 ఏళ్ల పాటు టీమ్ ఇండియా తరపున ఆడిన సమయమే.. అది తన జీవితంలో అత్యుత్తమమని సౌరవ్ గంగూలీ తెలిపాడు. సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో మీరు ఏదైనా చేయగలరు. కానీ, నేను 15 ఏళ్ల పాటు భారత్‌కు ఆడిన సమయమే నాకు ఉత్తమ సమయం. బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ఇప్పుడు నా దృష్టి వేరే పనిపై కేటాయించడమే” అంటూ చెప్పుకొచ్చాడు.
అధ్యక్షుడిగా రోజర్ బన్నీ..
ఏదైనా పెద్ద పని చేయాలంటే.. అంతకుముందు చాలా ఇవ్వాల్సి వస్తుందని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. మాజీ కెప్టెన్ మాట్లాడుతూ.. ‘‘నాకు చరిత్రపై నమ్మకం లేదు. అయితే ఈస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్రతిభ కరువైందని నాకు తెలిసింది. ఒక్కరోజులో అంబానీ, నరేంద్ర మోదీ ఎవరూ కాలేరు. ఇలా అవ్వాలంటే ఏళ్ల తరబడి కష్టపడాల్సి ఉంటుంది’ అని తెలిపాడు.
బీసీసీఐ రాజ్యాంగ సవరణ తర్వాత సౌరవ్ గంగూలీకి సెకండ్ ఇన్నింగ్స్ ప్రెసిడెంట్ అవుతాడనే ఊహాగానాలు వచ్చామరు సంగతి తెలిసిందే. అయితే రెండోసారి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి బీసీసీఐలో మద్దతు లభించలేదని వార్తలు వచ్చాయి. అంతేకాదు బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ విఫలమయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ వారం ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన బీసీసీఐ ఆఫీస్ బేరర్ల సమావేశం తర్వాత సౌరవ్ గంగూలీ ఇకపై బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండడని దాదాపు స్పష్టమైంది. బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బన్నీ నామినేషన్ దాఖలు చేశారు. రోజర్ బన్నీకి సవాల్ విసిరేందుకు ఇంకా ఇతర నామినేషన్లు దాఖలు కాలేదు. ఇటువంటి పరిస్థితిలో రోజర్ బన్నీ బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది. అంతే కాదు బీసీసీఐ సెక్రటరీ పదవిని మాత్రం జే షా తన వద్దే ఉంచుకున్నాడు.