AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: కెప్టెన్సీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మధ్య తేడా ఇదేనంట.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. అయితే అప్పటినుంచి కెప్టెన్సీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఎవరు బెటర్ అనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒకో రకంగా స్పందిస్తూ..

Cricket: కెప్టెన్సీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మధ్య తేడా ఇదేనంట.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Virat Kohli Rohit Sharma
Amarnadh Daneti
|

Updated on: Oct 13, 2022 | 3:01 PM

Share

భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. అయితే అప్పటినుంచి కెప్టెన్సీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఎవరు బెటర్ అనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒకో రకంగా స్పందిస్తూ వస్తున్నారు. కొందరు కోహ్లీ బెస్ట్ అంటే.. మరికొంతమంది కొన్ని విషయాల్లో రోహిత్ బెస్ట్ అంటూ కూడా చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కోరే అండర్సన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పాత్ర పై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒకరు టీమ్‌ఇండియాను విదేశాల్లోనూ విజయపథంలో నడపగా.. మరొకరు వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలిచిన కెప్టెన్ గా రికార్డులో ఎక్కారు. ప్రస్తుతం రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ ఆడనుంది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ స్థానంలో జట్టు బాధ్యతలను రోహిత్ శర్మ చేపట్టాడు. పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారిన తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు పది ద్వైపాక్షిక సిరీస్‌లను గెలిచింది. ఆసియా కప్‌లో మాత్రం ఓటమి చెందింది.

మరోసారి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచకప్‌ బరిలోకి దిగనుంది. కెప్టెన్సీ బాధ్యతలు వదిలేసిన తర్వాత బ్యాటింగ్‌పై దృష్టిపెట్టిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఓ రేంజ్‌లో చెలరేగుతున్నాడు. ఫామ్‌ అందుకొని దాదాపు మూడేళ్ల తర్వాత శతకంతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా టీమిండియా విదేశాల్లోనూ అద్భుత విజయాలను అందుకుంది. జట్టును నడపడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య వ్యత్యాసాలను న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కోరే అండర్సన్ వివరించాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీరు కాస్త భిన్నంగా ఉంటుందని, విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటాడని చెప్పాడు. తన ప్రణాళికలను అక్కడికక్కడే నిర్దేశించుకుంటాడన్నారు. రోహిత్ శర్మ తానేం చేయాలని అనుకుంటాడో దాని కోసం పక్కాగా సిద్ధమవుతాడని తెలిపాడు. తన జట్టు నుంచి కూడా అదే రావాలని కోరుకుంటాడని, రోహిత్ ప్రోయాక్టివ్‌గా ఉంటాడని అన్నారు.  మైదానంలోకి దిగే ముందే ఫలితం కోసం ఏమి చేయాలో ముందే అంచనాకు వచ్చేస్తాడన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..