WIPL 2023: మహిళల ఐపీఎల్ తొలి సీజన్‌కు రంగం సిద్ధం.. 5 జట్లు.. రెండు వేదికల్లో 20 లీగ్ మ్యాచ్‌లు..
మీడియా కథనాల ప్రకారం వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభం కానుంది. తొలి సీజన్‌లో ఐదు జట్లను చేర్చనున్నారు. ఈ జట్లను ఎలా ఎంపిక చేయాలనే దానిపై కూడా..
మహిళల T20 ఛాలెంజ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి మహిళల IPL ఫుల్ సీజన్‌కు నిరంతర డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అయితే, ఈ క్రమంలో ఈ ఏడాది అభిమానులకు గొప్ప వార్తను బీసీసీఐ అందంచింది. మహిళల ఐపీఎల్‌కు సంబంధించిన రోడ్‌మ్యాప్ పూర్తిగా సిద్ధమైందని, వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కావచ్చని బీసీసీఐ పేర్కొంది. తాజాగా మహిళల ఐపీఎల్‌కు సంబంధించి మరికొన్ని అప్‌డేట్‌లు బయటకు వచ్చాయి. అందులో జట్టు, వేదిక, మ్యాచ్‌ల గురించి సమాచారం అందించింది.
ఐపీఎల్‌లో ఐదు జట్లు..
మీడియా కథనాల ప్రకారం వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభం కానుంది. తొలి సీజన్‌లో ఐదు జట్లను చేర్చనున్నారు. ఈ జట్లను ఎలా ఎంపిక చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పురుషుల ఐపీఎల్‌లో మాదిరిగా జోన్ (నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, నార్త్ ఈస్ట్, వెస్ట్) లేదా నగరాల వారీగా (చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా) జట్లను విభజించడం బోర్డుతో ఉన్న మొదటి ఎంపికగా పేర్కొంటున్నారు.
కేవలం రెండు వేదికలపైనే మ్యాచ్‌లు..
ఐదు జట్లకు రెండు వేదికలు మాత్రమే నిర్ణయించనున్నారంట. ముందుగా అన్ని జట్లు ఒక వేదికపై మ్యాచ్‌లు ఆడి, ఆ తర్వాత కలిసి మరో వేదికకు చేరుకుంటాయి. 2024 సీజన్ రెండు వేర్వేరు మైదానంలో ఆడనున్నట్లు తెలుస్తోంది. 2024 నుంచి మిగిలిన జట్లకు కేటాయించిన మైదానంలో జరగనున్నాయంట. కాగా, ప్రస్తుతం అంటే వచ్చే ఏడాది 2023లో మాత్రం ఒక మైదానంలోనే ఆడనున్నాయని తెలుస్తోంది.
లీగ్ రౌండ్‌లో 20 మ్యాచ్‌లు..
ఐదు జట్లు 20 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు తలపడనున్నాయి. ఏ జట్టు అగ్రస్థానంలో ఉందో ఆ జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుండగా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌ను ఆడతాయి. ఇక్కడ ప్రతి జట్టు ఐదుగురు విదేశీ ఆటగాళ్లను కలిగి ఉండటానికి అనుమతించనున్నారు. ఇందులో నలుగురు ఆటగాళ్ళు ICC పూర్తి సభ్య దేశాల నుంచి తీసుకోవాల్సి ఉండగా, ఒక ప్లేయర్ మాత్రం అసోసియేట్ దేశం నుంచి ఉంటారంట.
బీసీసీఐపై విమర్శలు..
గతేడాది మహిళల ఐపీఎల్‌పై బీసీసీఐ సీరియస్‌గా కనిపించలేదు. బోర్డు ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశంలో మహిళా క్రికెటర్ల సంఖ్య పెరిగేకొద్దీ విస్తృతమైన టోర్నమెంట్‌లతో ముందుకు వస్తుందని బీసీసీఐ పెద్దలు చెప్పుకొస్తున్నారు. అప్పటి నుంచి బోర్డుపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఇది జరిగిన కొద్దిసేపటికే వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించడం గమనార్హం.