Watch Video: వాయమ్మో.. ఇదేం ఫీల్డింగ్ సామీ.. కంగారులకే చెమటలు పట్టించావుగా..
బెన్ స్టోక్స్ గాలిలో డైవింగ్ చేసి ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఆరు పరుగులు రావాల్సిన చోట.. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇంగ్లండ్ ఆల్ రౌండర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. కానీ, తన ఫీల్డింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, స్టోక్స్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని అద్భుతమైన ఫీల్డింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్ ఒక అద్భుతమైన షాట్ కొట్టాడు. బంతి లాంగ్ ఆఫ్ మీదుగా సిక్స్ వెళ్తుందని అంతా భావించారు. కానీ, స్టోక్స్ మాత్రం తన మెరుపు ఫీల్డింగ్‌తో బాల్‌ను సిక్స్ కాదు కదా కనీసం బౌండరీ లైన్ కూడా దాటకుండా చేసి, ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవడం ఆస్ట్రేలియా బ్యాటర్ల వంతైంది. స్టోక్స్ బౌండరీ వెలుపల పడబోతున్నాడని తెలుసుకుని, బంతిని మైదానం లోపలకు విసిరాడు. బౌండరీ లైన్ వెలుపల పడిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ అందుకుని బౌలర్ వద్దకు విసిరాడు. ఆస్ట్రేలియా ఆరు పరుగులు చేయాల్సిన చోట కేవలం రెండు పరుగులు మాత్రమే రాబట్టుకుంది.
కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది . పెర్త్‌లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లిష్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ కూడా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
BEN STOKES, WOW ?#AUSvENGpic.twitter.com/WFzDa44Yd3
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2022
ఇంగ్లండ్ తరపున డేవిడ్ మలన్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అదే సమయంలో, మొయిన్ అలీ 27 బంతుల్లో 44 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ మూడు, ఆడమ్ జంపా రెండు వికెట్లు తీశారు. ఇక ఆస్ట్రేలియా తరపున మిచెల్ మార్ష్ 45, టిమ్ డేవిడ్ 40 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ సామ్ మూడు వికెట్లు తీశాడు.