Video: బుడ్డోడే కానీ, బౌలింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. పిలిచి మరీ స్పెషల్ ట్రీట్ ఇచ్చిన టీమిండియా సారథి..
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న భారత జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉంది. అయితే, ఒక చిన్నారి బౌలర్ యాక్షన్‌కు ఫిదా అయిన రోహిత్.. ఏకంగా
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న భారత జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022కు సిద్ధమైంది. జట్టు WACAలో ప్రాక్టీస్ చేస్తోంది. ప్రాక్టీస్‌కు ముందు, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మనసు ఓ చిన్న పిల్లాడిపై పడింది. ఆ చిన్నారి తన బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో.. చుట్టుపక్కల వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ముచ్చటపడిన టీమిండియా సారథి.. ఆ చిన్న పిల్లవాడిని పిలిచిమరీ నెట్స్‌లో బౌలింగ్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ చిన్నారి పేరు దృషిల్ చౌహాన్. అతని వయస్సు 11 సంవత్సరాలు. ఈ చిన్నారి బౌలింగ్ యాక్షన్‌తో రోహిత్ బాగా ఇంప్రెస్ అయ్యాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. అంతకుముందు టీమ్ ఇండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఈ రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో గెలిచి, మరొకదానిలో ఓడిపోయింది.
నెట్స్‌లో బౌలింగ్ చేసిన చిన్నారి..
ప్రాక్టీస్ చేసేందుకు టీమిండియా మైదానానికి చేరుకోగానే కొందరు చిన్నారులు క్రికెట్ ఆడుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిలో ఎడమచేత్తో బౌలింగ్ చేస్తున్న ఈ చిన్నారి బౌలర్‌ని చూసి రోహిత్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఈ బౌలర్ యాక్షన్ తనకు బాగా నచ్చడంతో రోహిత్ ఆ చిన్నారిని పిలిచాడు. రోహిత్ ఈ చిన్నారిని తన వెంట తీసుకెళ్లి నెట్స్‌లో బౌలింగ్ చేయించాడు.
BCCI అప్‌లోడ్ చేసిన వీడియోలో, జట్టు విశ్లేషకుడు హరి ప్రసాద్ మోహన్ మాట్లాడుతూ, “మేం మధ్యాహ్నం సెషన్ కోసం WACA చేరుకున్నాం. అక్కడ పిల్లలు ఉదయం సెషన్‌ను ముగించే పనిలో ఉన్నారు. మేం డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లగానే దాదాపు 100 మంది పిల్లలు ప్రాక్టీస్ చేయడం చూశాం. అందరి దృష్టిని ఓ చిన్నారి ఆకర్షించాడు. ఆ పిల్లాడు బౌలింగ్ చేయడానికి వచ్చిన వెంటనే అతని యాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లాడి యాక్షన్ చాలా స్మూత్ గా ఉంది. దీంతో ముచ్చటపడిన రోహిత్ ఆ చిన్నారిని పిలిచి బౌలింగ్ చేయమని అడిగాడని చెప్పుకొచ్చాడు”.
?? ??? ????!
When a 11-year-old impressed @ImRo45 with his smooth action! ? ?
A fascinating story of Drushil Chauhan who caught the eye of #TeamIndia Captain & got invited to the nets and the Indian dressing room. ? ? #T20WorldCup
Watch ?https://t.co/CbDLMiOaQO
— BCCI (@BCCI) October 16, 2022
ఆశ్చర్యపోయిన పిల్లాడు..
రోహిత్ పిలవడంతో ఆ చిన్నారి కూడా ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లాడు మాట్లాడుతూ, నేను ఆశ్చర్యపోయాను. అంతకు ముందు రోజు మా నాన్న నాకు బాగా బౌలింగ్ చేయగలవని చెప్పాడు. కాబట్టి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను 99 శాతం సంతోషించాను. నాకు ఇష్టమైన బంతి ఇన్‌స్వింగ్ యార్కర్ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ చిన్నారి బౌలర్ వేసిన బంతులను రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ చిన్నారి కూడా టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ చూసి, మిగతా ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిన్నారికి రోహిత్ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు.