AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: ఆసియా విజేతకు చుక్కలు చూపించిన పసికూన.. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన లంక..

టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న ఈ టోర్నీలో గ్రూప్ మ్యాచుల్లో భాగంగా మొదటి మ్యాచ్ లో శ్రీలంక-నమిబీమా తలపడగా.. ఈ మ్యాచ్ లో పసికూన నమిబియా సంచలనమే సృష్టించింది. శ్రీలంకను 55 పరుగుల..

T20 World Cup 2022: ఆసియా విజేతకు చుక్కలు చూపించిన పసికూన.. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన లంక..
Namibia Cricket Team
Amarnadh Daneti
|

Updated on: Oct 16, 2022 | 1:26 PM

Share

టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న ఈ టోర్నీలో గ్రూప్ మ్యాచుల్లో భాగంగా మొదటి మ్యాచ్ లో శ్రీలంక-నమిబీమా తలపడగా.. ఈ మ్యాచ్ లో పసికూన నమిబియా సంచలనమే సృష్టించింది. శ్రీలంకను 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన శ్రీలంక నమిబీయాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నమిబీయా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి163 పరుగులు చేసింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం రోజునే బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆసియా కప్ 2022 విజేత శ్రీలంకకు నమిబీయా జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన నమిబీయా ప్రారంభ ఓవర్లలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఆరు పరుగులకే మొదటి వికెట్ కోల్పోయిన నమిబీయా జట్టు పవర్ ప్లేలో మూడు వికెట్లను కోల్పోయింది.

140 పరుగులు చేయడమే ఎక్కువ అనుకున్న సందర్భం నుంచి అనూహ్యంగా 163 పరుగులను నమిబీయా జట్టు చేసింది. చివరిలో నమిబీయా బ్యాట్స్ మెన్ జాన్ ఫ్రై లింక్ 28 బంతుల్లో 44, జె.స్మిత్ 16 బంతుల్లో 31 పరుగులు చేసి భారీ స్కోర్ సాధించాడానికి కారణమయ్యారు. 14.2 ఓవర్లకు 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన నమిబీమా ఏడో వికెట్ ను 20వ ఓవర్ చివరి బంతికి 163 పరుగులు వద్ద కోల్పోయింది. జాన్ ఫ్రైలింక్, జె.స్మిత్ భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో నమిబీమా జట్టు ప్రపంచకప్ మొదటిరోజే సంచలనం నమోదుచేసి.. సూపర్ 12 చేరడానికి ఓ అడుగు ముందుకేసింది.

నమిబీయా జట్టుకు ఓపెనర్స్ మైఖేల్ వాన్ లింగేన్, దివాన్ లా కాక్ శుభారంభాన్ని ఇవ్వలేదు. లింగేన్ 3, కాక్ 9 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నికోల్ లాప్టీ ఈటన్, స్టీపన్ బార్డ్ నిలకడగా ఆడుతూ 35 పరుగుల వరకు మూడో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత వచ్చిన ఎరాస్మస్ కూడా 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన జాన్ ఫ్రైలింక్ శ్రీంలక బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అతడికి జెజె.స్మిత్ తోడవ్వడంతో వీరిద్దరూ లంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో నమిబీయా జట్టు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లు పి.మదుషన్ రెండు వికెట్లు తీసుకోగా, తీక్షణ, చమీర, కరుణరత్నే, హసరంగాలు ఒక్కొక్కరు తమ పూర్తి కోటా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. హసరంగ, తీక్షణ మినహా మిగిలిన ముగ్గురు బౌలర్లు ఒక్కో ఓవర్ కు సగటున 9కంటే ఎక్కువ పరుగులిచ్చారు.

ఇవి కూడా చదవండి

164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు చుక్కలు చూపించారు నమిబీయా బౌలర్లు. 19 ఓవర్లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది లంక. దీంతో 55 పరుగుల తేడాతో పసికూన నమిబీయా జట్టు విజయం సాధించింది. 12 పరుగలకే శ్రీలంక మెండిస్ రూపంలో మొదటి వికెట్ కోల్పోగా ఆతర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ అంతా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దాసున్ షనక 29, భానుక రాజపక్స 20 పరుగులు మినహాయిస్తే మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరూ తమ వ్యక్తిగత స్కోర్ 12 దాటలేకపోయారు. గుణతిలక, మధుషన్ లు పరుగులు ఏమి చేయకుండానే పెవిలియన్ చేరారు. దీంతో శ్రీలంక భారీ ఓటమిని చవిచూసింది. నమిబీయా బౌలర్లు డేవిడ్ వైస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, జాన్ ఫ్రైలింక్ లు ఒక్కోక్కరూ రెండేసి వికెట్లు పడగొట్టారు. బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న జాన్ ఫ్రైలింక్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..