T20 World Cup: టీ20 ప్రపంచ కప్ కంటే బూమ్రాకు అదే ముఖ్యం.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా ఈ మెగా టోర్నికి అందుబాటులో లేడు. దీంతో భారత బౌలింగ్ కొంత బలహీనంగా ఉందని, ముఖ్యంగా బుమ్రా లేకపోవడంతో డెత్ బౌలింగ్ కష్టంగా మారిందనే చర్చ కొద్దిరోజులుగా జరుగుతోంది. అయితే తాజాగా బుమ్రా విషయంలో భారత..

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ కంటే బూమ్రాకు అదే ముఖ్యం.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 16, 2022 | 10:24 AM

టీ20 ప్రపంచ కప్ సమయం అక్టోబర్ 16వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమైంది. గ్రూప్ మ్యాచుల్లో తలపడుతున్న జట్లలో రెండు జట్లు సూపర్ 12కు చేరుకుంటాయి. అక్టోబర్ 22వ తేదీ నుంచి సూపర్ 12 మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా ఈ మెగా టోర్నికి అందుబాటులో లేడు. దీంతో భారత బౌలింగ్ కొంత బలహీనంగా ఉందని, ముఖ్యంగా బుమ్రా లేకపోవడంతో డెత్ బౌలింగ్ కష్టంగా మారిందనే చర్చ కొద్దిరోజులుగా జరుగుతోంది. అయితే తాజాగా బుమ్రా విషయంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. టీ20 ప్రపంచకప్‌ కంటే జస్‌ప్రీత్‌ బుమ్రా కెరీర్‌ చాలా ముఖ్యమని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. వెన్నులో గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో మహ్మద్ షమీని బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసింది. అయితే డెత్ ఓవర్ లో ఎక్కువ పరుగులివ్వకుండా ప్రత్యర్థి జట్టును నియంత్రించే బౌలర్ లేకుండా టీ20 ప్రపంచకప్ లో భారత్ ఎలా రాణిస్తుందనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. బుమ్రా గాయాలకు సంబంధించి ఎంతో మంది నిపుణులతో మాట్లాడామని, తాను గాయాలు నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సానుకూల నివేదికలు రాలేదన్నారు.

టీ20 ప్రపంచ కప్ ఎంతో ముఖ్యమైనది, అయినప్పటికి దానికంటే కూడా అతడి కెరీర్ చాలా ముఖ్యమైనదని రోహిత్ శర్మ అన్నారు. అతడి వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమేనని, భవిష్యత్తులో బుమ్రాకు ఎంతో క్రికెట్ కెరీర్ ఉందని అన్నారు. అందుకే బుమ్రా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేమని తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. రానున్న రోజుల్లో ఎంతో క్రికెట్ కెరీర్ ఉందని, ఎన్నో మ్యాచ్ లు ఆడి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషిస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదన్నాడు రోహిత్ శర్మ.

క్రీడల్లో గాయాలు భాగమని, వాటి గురించి ఎక్కువుగా ఆలోచించినా ఏమీ చేయలేమన్నారు. ఆటలు ఆడే కొద్ది గాయాలు కావడం సహజమని రోహిత్ శర్మ పేర్కొన్నారు. సీనియర్ ఆటగాళ్లకు గాయాల కారణంగా యువకులకు అవకాశం దొరుకుంతన్నాడు. మహ్మద్ షమీ ఇటీవల కోవిడ్ బారిన పడ్డాడని, తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్న తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి శిక్షణ తీసుకున్నాడని, ప్రస్తుతం బ్రిస్బేన్‌లో ఉన్నాడని రోహిత్ శర్మ తెలిపాడు. గాయం కారణంగా గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని బీసీసీఐలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయగా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్ బై ఆటగాళ్లుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..