Mitchell Starc: టీమిండియా బౌలర్‌పై ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏకిపారేస్తోన్న టీమిండియా ఫ్యాన్స్‌

ముఖ్యంగా చేతుల్లోకొచ్చిన మ్యాచ్‌ చేజారిపోవడంపై సహించలేని బ్రిటిష్ మీడియా ఈ ఘటనపై రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో దీప్తి శర్మకు కూడా పలువురి మద్దతు లభించింది.

Mitchell Starc: టీమిండియా బౌలర్‌పై ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏకిపారేస్తోన్న టీమిండియా ఫ్యాన్స్‌
Mitchell Starc
Follow us
Basha Shek

|

Updated on: Oct 15, 2022 | 9:22 PM

ఇటీవల ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను టీమిండియా బౌలర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగానే ఆమె ఔట్‌ చేసినప్పటికీ కొందరు మాత్రం దీప్తి తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చేతుల్లోకొచ్చిన మ్యాచ్‌ చేజారిపోవడంపై సహించలేని బ్రిటిష్ మీడియా ఈ ఘటనపై రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో దీప్తి శర్మకు కూడా పలువురి మద్దతు లభించింది. నిబంధనలకు అనుగుణంగానే ఆమె రనౌట్‌ చేసిందంటూ మాజీ క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు అండగా నిలబడ్డారు. కాగా ఈ ఘటన జరిగి చాలారోజులవుతుంది. అయినా కొందరు మాత్రం దీనిని మళ్లీ గుర్తు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ దీప్తి శర్మను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

దీప్తిని ఎందుకు లాగావు?

వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ సందర్భంగా మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌కు వచ్చాడు. అదే సమయంలో నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న జోస్‌ బట్లర్‌ బంతి పడకుండానే క్రీజు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే స్టార్క్‌ అతనిని రనౌట్‌ చేయలేదు. కేవలం బట్లర్‌కు వార్నింగ్‌ ఇచ్చి వదిలిపెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ‘నేనేమి దీప్తిని కాదు..మన్కడింగ్‌ చేయడానికి.. అయితే ఇది మరోసారి రిపీట్‌ చేయకు బట్లర్‌’ అని చెప్పడం టీమిండియా ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. సోషల్‌ మీడియా వేదికగా స్టార్క్‌ను తిట్టిపోస్తున్నారు. ‘ నీకు క్రికెట్‌ రూల్స్‌ తెలియవా?’ అయినా నీ గేమ్‌ గురించి నువ్వు చూసుకో.. పక్కవాళ్ల గురించి కామెంట్లు చేయడం దేనికి’, ‘దీప్తి ప్రస్తావన ఎందుకు తెచ్చావ్‌’ అంటూ భారత జట్టు అభిమానులు ఫైర్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

నీ నుంచి అస్సలు ఊహించలేదు..

ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ హేమంగ్‌ బదాని స్పందించాడు.. స్టార్క్‌ నువ్వింకా ఎదగాలి. నీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఊహించలేదు. దీప్తి నిబంధనలకు లోబడే మన్కడింగ్‌ చేసింది. నువ్వు ఒకవేళ నాన్‌స్ట్రైకర్‌ను హెచ్చరించాలని భావిస్తే అది నీ ఇష్టం అలాగే చేయి.. అది నీ సొంత నిర్ణయం. అంతేకానీ మధ్యలో దీప్తి పేరును ఎందుకు లాగావు? క్రికెట్‌ ప్రపంచం నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’ అని స్టార్క్‌పై మండిపడ్డాడు బదాని.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక ్చేయండి..