AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetha Singh: చిట్టీలు కట్టి 6 కోట్ల వరకు నష్టపోయాను.. ఆత్మహత్యకు ప్రయత్నించాను.. కన్నీటి పర్యంతమైన కితకితలు హీరోయిన్‌

లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది గీతా సింగ్‌. అయితే ఏమైందో తెలియదు గానీ ఉన్నట్లుండి ఆమె సినిమాలకు దూరమైపోయింది.

Geetha Singh: చిట్టీలు కట్టి 6 కోట్ల వరకు నష్టపోయాను.. ఆత్మహత్యకు ప్రయత్నించాను.. కన్నీటి పర్యంతమైన కితకితలు హీరోయిన్‌
Geetha Singh
Basha Shek
|

Updated on: Oct 15, 2022 | 6:54 PM

Share

అల్లరి నరేశ్‌ హీరోగా నటించిన కితకితలు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది గీతాసింగ్‌. దివంగత ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇందులో తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే కాదు సెంటిమెంట్‌తో కన్నీళ్లు తెప్పించింది గీతాసింగ్‌. ఇందులో ఆమె అభినయానికి మంచి పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత ఎవడిగోల వాడిదే, శశిరేఖా పరిణయం, సీత టపాకాయ్‌, కెవ్వుకేక, పోటుగాడు, శంకరాభరణం, సరైనోడు, కల్యాణ వైభోగమే, ఈడో రకం ఆడో రకం, తెనాలి రామకృష్ణ తదితర సినిమాల్లోనూ లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది గీతా సింగ్‌. అయితే ఏమైందో తెలియదు గానీ ఉన్నట్లుండి ఆమె సినిమాలకు దూరమైపోయింది. అయితే గతేడాది జరిగిన మా ఎలక్షన్స్‌లో మంచు విష్ణు ప్యానెల్‌ తరపున పోటీ చేసి గెలుపొందింది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

నమ్మినవాళ్లే నట్టేట ముంచారు..

‘ఇండస్ట్రీలో నాకు అవకాశాలు రావడం లేదు. అందుకే నటించడం లేదు. పరిశ్రమలో అసలు సపోర్ట్‌ లేదు. ఇండస్ట్రీలో పురుషాధిక్యం ఎక్కువ. మన దగ్గర ఎంతోమంది లేడీ కమెడియన్స్‌ ఉన్నారు. కానీ ఎవరూ సినిమాల్లో కనిపించడం లేదు. నా ప్రస్తుత పరిస్థితికి కారణం నేను నమ్మిన వాళ్లే. దారుణంగా మోసం చేశారు. ఆఖరకు నా తోడబుట్టిన వాళ్లే నన్ను డబ్బు కోసం వాడుకున్నారు. సినిమాల్లో నటించి ఎంతో కష్టపడి సంపాందిచుకున్న డబ్బును ఓ మనిషిని నమ్మి పోగొట్టుకున్నాను. ఒకరి దగ్గర చిట్టీలు వేసి దారుణంగా మోసపోయాను. సుమారు రూ. 6 కోట్ల వరకు నష్టపోయాను’

‘అదే సమయంలో సినిమావకాశాలు లేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఈ సమయంలో నా స్నేహితురాలే నాకు అండగా నిలిచింది. ప్రస్తుతం అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని వారితోనే జీవనం సాగిస్తున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేసింది గీతాసింగ్‌. కాగా గీతాసింగ్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..