Satyadev : అటు హీరోగా ఇటు క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న వర్సటైల్ యాక్టర్.. సత్యదేవ్ హీరోగా మరో సినిమా

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు సత్యదేవ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

Satyadev : అటు హీరోగా ఇటు క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న వర్సటైల్ యాక్టర్.. సత్యదేవ్ హీరోగా మరో సినిమా
Satyadev
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 15, 2022 | 6:41 PM

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ ఒక వైపు హీరోగా చేస్తూనే మరో వైపు కీలక పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు సత్యదేవ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. సత్యదేవ్ , కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్నారు. నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించారు నిర్మాతలు. ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించనుంది. ఇది ప్రియా భవానీ శంకర్ తొలి తెలుగు చిత్రం కానుంది. ఇటీవలి బ్లాక్‌బస్టర్ గా నిలిచిన తిరుతో సహా మరికొన్ని తమిళ చిత్రాలలో ఆమె నటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌పై ఉన్న వస్తువులను పరిశీలిస్తే- కుట్టు కొలిచే టేప్, కట్టర్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రియా ఫ్యాషన్ డిజైనర్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా వుండబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సత్యదేవ్‌, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో అలరించి తమకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి చేస్తున్న ఈ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రముఖ నటీనటులను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!