AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చోరీ చేస్తూ సీసీ కెమెరాల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పోలీస్‌.. మరి సిల్లీగా అది దొంగతనం చేయడమేంటి సామీ..

ఇటీవల కొందరు పోలీసులు దొంగతనాలు చేస్తూ సీసీ కెమెరాల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడడం సంచలనం సృష్టించాయి. అలాంటి పోలీసులపై సస్పెన్షన్‌ వేటు కూడా పడింది. అయినా వారిలో మార్పు రావడం లేదు.

చోరీ చేస్తూ సీసీ కెమెరాల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పోలీస్‌.. మరి సిల్లీగా అది దొంగతనం చేయడమేంటి సామీ..
Up Cop
Basha Shek
|

Updated on: Oct 15, 2022 | 8:37 PM

Share

ప్రజలకు రక్షణ కల్పించడం, నేరస్తులను నేరాలు చేయకుండా అడ్డుకోవడం, వారికి శిక్షలు పడేలా చేయడమే పోలీసుల పని. అలాంటిది పోలీసులే దొంగగా మారితే ? ఇది సాధారణంగా అరుదుగా జరగుతుంది. ఇటీవల కొందరు పోలీసులు దొంగతనాలు చేస్తూ సీసీ కెమెరాల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడడం సంచలనం సృష్టించాయి. అలాంటి పోలీసులపై సస్పెన్షన్‌ వేటు కూడా పడింది. అయినా కొందరు పోలీసులు మాత్రం మారడం లేదు. కంచె చేను మేసినట్లుగా ప్రజలకు రక్షణ ఉండాల్సిన రక్షకభటులే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక పోలీసు అధికారి బల్బును దొంగిలించడం కనిపిస్తుంది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ ఘటనే జరిగింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో సదరు పోలీసు వ్యవహారం బట్టబయలైంది. విషయం ఉన్నతాధికారుల దాకా వెళ్లడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా అతనిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.

సీసీ పుటేజీ చూసి అవాక్కయ్యాడు..

వివరాల్లోకి వెళితే దసరా నవరాత్రుల సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో కొద్దిరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్ వర్మ అనే పోలీస్ కానిస్టేబుల్ కు నైట్ డ్యూటీ వేశారు. ఇటీవల ఓ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్.. మెల్లగా నడుచుకుంటూ ఓ షాపు వద్దకు వెళ్లాడు. కొద్దిసేపు అటూ ఇటూ చూశాడు. నేరుగా ఎల్‌ఈడీ విద్యుత్ బల్బు ఉన్న చోటుకు వెళ్లాడు. బల్బు తీసుకుని జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరునాడు దుకాణానికి వచ్చిన యజమాని తన షాపు ముందు బల్బు లేకపోవడం గమనించచాడు. సీసీ కెమెరా పుటేజీని చూశాడు. అందులో ఒక కానిస్టేబుల్ బల్బు ఎత్తుకుపోవడం చూసి అవాక్కయ్యాడు. చివరకు ఇది పోలీసుల వరకు వెళ్లింది. సీసీ కెమెరా పుటేజీని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

కాగా దీనికి సంబంధించిన సీసీ పుటేజీ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కానిస్టేబుల్‌ ప్రవర్తనపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తనకు విధులు కేటాయించిన చోట చీకటిగా ఉన్నందున.. అందుకే దుకాణం ముందున్న బల్బును తీసి అక్కడ అమర్చినట్లు కానిస్టేబుల్‌ చెబుతున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..