Youngman swimming in sea: సముద్రంలో 13 కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చాడు.. తీరం చేరగానే..!(వీడియో)
ఓ యువకుడు కుటుంబంతో కలిసి బోటులో సముద్రంలో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఆ యువకుడు సముద్రంలోకి దూకేసాడు. ఆ తర్వాత ఏకంగా 13 కి.మీ. సముద్రంలో ఈదుకుంటూ మొత్తానికి తీరం చేరాడు. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్... అదేంటంటే..
ఏమైతేనేం ఆ యువకుడి గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. అతను శ్రీలంకకు చెందినవాడు. కుటుంబంతో కలిసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో సముద్రంలో బోటులో తమిళనాడుకు బయలుదేరాడు. కొంత దూరం వచ్చాక అతను సముద్రంలోకి దూకేసాడు. అనంతరం 13 కిలోమీటర్లు ఈదుకుంటూ మొత్తానికి తమిళనాడు రామేశ్వరం తీరానికి చేరుకున్నాడు. కానీ, రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పదన్నట్టు.. అతడు అక్రమంగా భారత్‌లో ప్రవేశించడంతో తీర గస్తీదళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అక్టోబరు 10న అతడిని అదుపులోకి తీసుకున్న కోస్ట్ గార్డ్ అధికారులు అతడి నుంచి గడువు ముగిసిన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. శ్రీలంకలోని తలైమన్నారుకు చెందిన హసాన్ ఖాన్ అలియాస్ అజయ్ అలియాస్ ఖాన్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి బోటులో వచ్చినట్టు గుర్తించారు. వారితో పాటు మరో వ్యక్తి కూడా వచ్చాడని, అందరినీ రామనాథపురం జిల్లా మండపం క్యాంపునకు తరలించినట్టు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

